NTV Telugu Site icon

AP School Education: ఏపీ విద్యాశాఖ వినూత్న నిర్ణయం.. దేశంలోనే తొలిసారి..!

Kona Sasidhar

Kona Sasidhar

AP School Education: ఆంధ్రప్రదేశ్‌లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది విద్యాశాఖ.. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవబోతోంది అంటున్నారు.. పాఠశాల విద్యాశాఖ సెక్రెటరీ కోన శశిధర్.. ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తాం.. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మెగా పేరెంట్‌ టీచర్‌ మీట్‌ నిర్వహణ ఉందన్నారు.. 38,319 మండలపరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు.. 2,807 మునిసిపల్ పాఠశాలలు, 1054 రెసిడెన్షియల్, 2843 ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ సమావేశం నిర్వహించనున్న్టు వెల్లడించారు.. కోటి మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు..

Read Also: Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?

పిల్లలు స్వయంగా తయారు చేసిన ఇన్విటేషన్ కార్డులు తలిదండ్రులకు ఇప్పించామని తెలిపారు కోన శశిధర్.. మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీయేనన్న ఆయన.. HOLISTIC PROGRESS CARD పిల్లలకు నచ్చే విధంగా తయారుచేశాం.. ప్రతి విద్యార్ధి గురించి ఉపాధ్యాయులు స్వయంగా రాస్తారు.. ప్రతీ పేరెంట్ కి Holistic Progress Card ఉపాధ్యాయులు స్వయంగా ఇవ్వడం ద్వారా ఇద్దరి మధ్య అనుసంధానం కలిగిస్తున్నాం.. తల్లులకు ఒక రంగోలీ పోటీ, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తాం.. 900 స్కూళ్లలో హెల్త్ స్క్రీనింగ్ చేశాం.. మిగిలిన స్కూళ్లలో కూడా జరుగుతుందని తెలిపారు.. ఇక, పూర్వ విద్యార్ధులు, ప్రస్తుత విద్యార్థులు, తలిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు ఉండగా ఒక యాక్టివ్ గా ఉండే తల్లులతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించాం.. విద్య, సదుపాయాలపై స్కూల్‌కు స్టార్ రేటింగ్ ఇస్తాం అన్నారు..

Read Also: RTC Driver Meets Nara Lokesh: ‘దేవర’ పాటకు స్టెప్పులేశాడు.. మంత్రి లోకేష్‌ని కలిశాడు..

ఇక, పూర్వ విద్యార్ధులు, డోనార్లు ఉంటే వారి నుంచి డొనేట్ చేయిస్తాం అన్నారు పాఠశాల విద్యాశాఖ సెక్రెటరీ కోన శశిధర్. ఎవరైనా జీవితంలో స్ధిరపడిన పూర్వ విద్యార్ధితో మాట్లాడిస్తాం.. పేరెంట్ ఇచ్చే సూచన, కంప్లైంట్ కూడా తీసుకుంటాం.. మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే భోజనం తలిదండ్రులు అందరికీ ఇస్తాం.. మధ్యాహ్న భోజన పథకం పై తల్లిదండ్రుల సూచనలు తీసుకుంటామని పేర్కొన్నారు.. మరోవైపు.. ఈ పొలిటికల్ బ్యానర్లు ఏవీ ఈ కార్యక్రమంలో ఉండబోవని స్పష్టం చేశారు.. సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల స్కూల్‌లో కార్యక్రమంలో పాల్గొంటారు.. ప్రతీ ఎమ్మెల్యే, ప్రతీ మంత్రి వారి నియోజకవర్గాల్లో పాల్గొనాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు.. మొత్తంగా ఏపీ విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది..

Show comments