Site icon NTV Telugu

SAAP: 2027లో ఏపీలోనే జాతీయ క్రీడలు.. మన యువతకు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా ఉంది..

Ravi Naidu

Ravi Naidu

SAAP: 2027లో ఏపీలో జాతీయ క్రీడలు నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నాం అన్నారు ఏపీ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్‌ అనిమిని రవి కుమార్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో అధునాతన క్రీడా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నిర్దేశించారు. ఏపీలో పలు జిల్లాల్లో హాస్టల్ వసతులుతో కూడిన క్రీడా శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తాం. “ఖేలో ఆంధ్ర ప్రదేశ్” గా ఏపీని తీర్చిదిద్దడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం అన్నారు.. “ఖేలో ఇండియా”నిధులను రాబట్టేందుకు 237 కోట్ల రూపాయల “డీపీఆర్”లను కేంద్రంకు సమర్పించాం. గతంలో చాలా తక్కువగా 10 నుంచి 15 కోట్ల వరకు మాత్రమే ఏపీకి “ఖేలో ఇండియా”నిధులు అందాయన్నారు.. అయితే, ఏపీలో క్రీడల్లో యువత బాగా రాణిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించి, మంచి శిక్షణ ఇప్పిస్తే ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకాలు సాధించే సత్తా ఏపీ యువతకు ఉందన్నారు.. వర్ధమాన క్రీడాకారులకు విశాఖలో హకీ క్రీడా వసతులు, ఒంగోలు, తిరుపతిలో వసతిగృహం (హాస్టల్) ఏర్పాటు చేస్తాం అన్నారు ఏపీ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్‌ అనిమిని రవి కుమార్.

Read Also: TG Assembly: భూభారతి బిల్లుపై చర్చను అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం

Exit mobile version