NTV Telugu Site icon

Andhra Pradesh: సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన విజయానంద్..

Ap Cs

Ap Cs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి.సాయి ప్రసాద్, యం.టి.కృష్ణబాబు, టీటీడీ ఇఓ శ్యామల రావు, జీఏడి కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు కాంతిలాల్ దండే, జయలక్ష్మి, కుమార్ విశ్వజిత్, పలువురు కార్యదర్శులు ఇతర అధికారులు సీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Dil Raju: కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

మాజీ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం పదవీవిరమణ చేశారు. ఈ క్రమంలో కొత్త సీఎస్‌గా విజయానంద్‌ బాధ్యతలు చేపట్టారు. విజయానంద్ స్వస్థలం వైఎస్సార్‌ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె. ఆదిలాబాద్‌ జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌ నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీగా కూడా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)గానూ పనిచేశారు.

Read Also: 2024 Rewind: ఈ ఏడాది అరెస్టై జైలుకెళ్లిన సినీ, రాజకీయ ప్రముఖులు వీళ్లే!

Show comments