Vidadala Rajini: మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఏపీలో పొలిటికల్ రచ్చ సాగుతూనే ఉంది.. ఈ అంశంపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని కీలక వ్యాఖ్యలు చేశారు.. చరిత్ర చెరిపేస్తే చెరగదు.. రాష్ట్ర చరిత్రలో ఒకేరోజు ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించిన ఘనత మా నాయకుడు జగన్ కే దక్కుతుందన్నారు.. 8500 కోట్లతో 17 మెడికల్ కళాశాలలు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం.. యుద్ధ ప్రాతిపదికన కళాశాలల నిర్మాణం పూర్తి చేసి పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తేవాలని చూసాం.. మూడు ఫేజ్ లలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టాలని రూట్ మ్యాప్ తో ముందుకు వెళ్ళాం. 500 కోట్లతో ఒక్కొక్క కళాశాల నిర్మాణం చేయాలని చూసాం. దీనిమీద అనేక బురదచల్లే ఆరోపణలు చేశారని మండిపడ్డారు.. కళాశాలలు అన్నీ రకాల ఫైనాన్సియల్ అసిస్టెన్స్ తోనే పనులు ప్రారంభించి ముందుకు వెళ్ళాం.. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేసే దిశగా అడుగులు వేశాం. అన్ని అనుమతులు లేవని ఇవాళ అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Read Also: Meena : ఆ ఫ్లైట్ లో సౌందర్యతో పాటు నేనూ వెళ్లాలి.. మీనా కామెంట్స్
ప్రతీ పేదవాడికి విద్య, వైద్య భద్రత కోసం 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టాం అన్నారు విడదల రజిని.. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా అనుమతులు తెచ్చి 50 సీట్లు అందుబాటులోకి తెచ్చాం. పులివెందుల కళాశాలలో మాకు సీట్లు వద్దు అని ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది అంటూ దుయ్యబట్టారు.. వైఎస్ కుటుంబం మీద ఉన్న కక్షను ఆ ప్రాంత ప్రజలపై చూపించారన్న ఆమె.. ఎన్నికల కోడ్ వచ్చే వరకు పనులు జరుగుతూనే ఉన్నాయి.. ఫస్ట్ ఫేజ్ లో పూర్తయిన ఐదు కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దృష్టి సారించి పనులు చేసి ఉంటే మరో ఐదు కళాశాలల్లో 750 సీట్లు అందుబాటులోకి వచ్చి ఉండేవి. థర్డ్ ఫేజ్ లో ఉన్న కళాశాలలకు సంబంధించిన మేజర్ వర్క్స్ మా హయాంలోనే పూర్తయ్యాయని వెల్లడించారు.. నిర్మాణాలు జరిగిన ప్రాంతంలో కాకుండా మరోవైపుకు వెళ్లిన మంత్రులు స్విమ్మింగ్ పూల్ అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలల పనులను ఆపి వేశారు. అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో పనులు నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గొప్ప ఆశయంతో జగన్ ప్రారంభించిన పనులను నీరుగార్చారు. పీపీపీ అని చెప్పి ఒక ముసుగేసి వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కళాశాలలు పూర్తయితే జగన్ కు మంచి పేరు వస్తుందని కుట్రలు చేస్తున్నారు. ప్రజల్లో విపరీతమైన ఆందోళన నెలకొంది. మీ నిర్ణయం తప్పు అని వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని ప్రకటించారు..
Read Also: Country With Zero Muslim Population: ప్రపంచంలో ఒక్క ముస్లిం కూడా లేని ఏకైక దేశం ఏదో తెలుసా..?
ఇక, శాఖకు సంబంధం లేని మంత్రులు వచ్చి అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు.. లేనిది ఉన్నట్లు చూపించటం అంటే గ్రాఫిక్స్.. కానీ, మంత్రి ఉన్నది లేనట్లు చూపించారని దుయ్యబట్టారు విడదల రజిని.. స్థానిక ప్రజలను అడిగితే పనులు ఎంతవరకు జరిగాయో చెప్తారు. 14 ఏళ్లు ముఖమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చే ఆలోచన అయినా చేశారా..? అని ప్రశ్నించారు.. చిత్తశుద్ధి లేకుండా కాలేజీలు ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నారు.. మీ నిర్ణయం తప్పు అని ఎంతవరకైనా పోరాడేందుకు మేం సిద్ధం అని ప్రకటించారు.. ప్రజల ఆరోగ్యాలను, విద్యార్ధుల భవిష్యత్తును గాలికి వదిలేయాలని చేస్తున్నారు.. మంత్రి సత్య కుమార్.. వైఎస్ జగన్ కు రాసిన లేఖలో వాస్తవానికి దూరంగా అనేక అంశాలు ఉన్నాయి.. మీ వల్లే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని లేఖలో ప్రస్తావించారు. ప్రైవేటీకరణ కరెక్ట్ అని వాళ్లకు వాళ్లే ఫిక్స్ అయ్యి నిర్ణయం తీసుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. జగన్ చేసిన మంచి ప్రజల గుండెల్లో ఉంటుంది. మెడికల్ కళాశాలల పీపీపీ మోడ్ ఎక్కడా సక్సెస్ కాలేదు. పలు రాష్ట్రాల్లో ఈ విధానం ట్రై చేసి సాధ్యం కాదని వదిలేశారని.. మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చాక మీరు తెచ్చిన ఈ పీపీపీ విధానాన్ని కచ్చితంగా రద్దు చేస్తామని ప్రకటించారు మాజీ మంత్రి విడదల రజిని.
