అనర్హత పిటిషన్ పై స్పీకర్ కార్యాలయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరిగింది. కాగా.. ఈ విచారణకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. అయితే.. వాసుపల్లి గణేష్ స్పీకర్ సీతారాంను ఒక్క నిమిషం మాత్రమే కలిసి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై పోటీ చేసి గెలిచాను.. తర్వాత టీడీపీ పేద వాళ్ళకు అన్యాయం చేస్తోందని గమనించి పార్టీకి దూరం జరిగానని తెలిపారు. తాను ఆ పార్టీని మోసం చేశానని టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు. అంతేకాకుండా.. స్పీకర్ తీసుకునే ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. స్పీకర్ ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఈ అంశంలో న్యాయ సలహా తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Read Also: AP High Court: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల లంచ్ మోషన్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
కాగా.. ఈరోజు వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యారు. ఉదయం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ తమ్మినేని.. మధ్యాహ్నం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేను విచారించారు. అయితే.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు విచారణకు రావాల్సి ఉండగా.. కేవలం వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం.. తీర్పు రిజర్వ్ చేసింది.
Read Also: Chandrababu: ‘రా కదలిరా’ సభలో గందరగోళం.. కిందపడబోయిన చంద్రబాబు
