Site icon NTV Telugu

AP Aqua Farming: ట్రంప్ ఎఫెక్ట్‌.. ఆక్వా రంగంపై పిడుగు..!

Ap Aqua Farming

Ap Aqua Farming

AP Aqua Farming: అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ఇపుడు ఆక్వారంగంపై పిడుగు పడినట్టు చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ పై విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఆక్వారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. నిన్నమొన్నటి వరకు రొయ్యలపై 3 నుంచి 4 శాతంగా ఉన్న సుంకాన్ని .. అమెరికా 25 శాతానికి పెంచడంతో ఎగుమతి చేయాలంటే ఇకపై భారీగా పన్నులు చెల్లించాలి. అమెరికా తాజా నిర్ణయంతో లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఎగుమతి చేయాలంటే 25 వేలు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుది.

Read Also: Story Board: నేతల పార్టీ జంప్‌కు చెక్ పడే మార్గమేంటి ? సుప్రీం బ్రేక్ వేస్తుందా ?

దీనికి అదనంగా రవాణా, ప్యాకింగ్‌ ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఇపుడు రొయ్యల సాగు చేసే రైతులకు గిట్టుబాటు అయ్యేది ఏమాత్రం ఉండదు.. దీంతో అమెరికా తీసుకున్న నిర్ణయం భారతదేశ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది అన్నది అర్ధం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు రొయ్యలు, సీఫుడ్ ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీ ఆక్వా రంగం మీద ఆధారపడి ఉన్న దాదాపు 8 లక్షల మంది రైతులు, అనుబంధ రంగాల కార్మికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. 2023-24లో 2.37 బిలియన్ డాలర్ల విలువైన సీఫుడ్ ఎగుమతి జరిగింది. ఇందులో రొయ్యల వాటానే 76 శాతం ఉంది. ఇప్పటికే రొయ్యల ధరలు తగ్గుతూ.. ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటన చేసిన రోజునే రొయ్యల కౌంట్ కు ఉండే ధరలను భారీగా తగ్గించేసారు ఎగుమతి దారులు.

Read Also: IND vs ENG Test: తడబడిన భారత్.. ఆదుకున్న కరుణ్‌ నాయర్..

అటు అమెరికా దెబ్బ ఇక్కడి లోకల్ సిండికేట్ల దెబ్బకు ఇపుడు రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫీడ్ రేట్లు అయినా తగ్గించి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.

Exit mobile version