Site icon NTV Telugu

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారం.. ముగ్గురు మంత్రులతో కమిటీ..!

Ap Govt

Ap Govt

Tirumala Laddu Controversy: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది.. ఈ వ్యవహారంపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తిరుమల లడ్డు అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్‌తో కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది సర్కార్‌.. ఈ కమిటీపై త్వరలో అధికారిక ఉత్తర్వుల జారీ చేసే అవకాశం ఉంది.. ఈ కమిటీ ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారం.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టనుంది. అంతేకాక, కూటమి‌లోని పార్టీల నేతలతో కూడిన మరో కమిటీ కూడా ఏర్పాటు చేయనుంది. రాజకీయ మరియు పాలనా పరంగా తిరుమల లడ్డూ వ్యవహారం పైన పూర్తి విశ్లేషణ చేయడానికి ఈ కమిటీలు కీలకంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే, త్వరలో కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, బీజేపీ ఏపీ చీఫ్‌ మాధవ్ సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

Read Also: Gadchiroli Encounter: గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. రూ.25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు నేత ప్రభాకర్ హతం.!

Exit mobile version