Site icon NTV Telugu

CM Chandrababu: టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం.. మంత్రులకు సీఎం కీలక సూచనలు..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించింది.. అయితే, ఈ కేసులో సిట్‌ నివేదికపై పెద్ద దుమారమే రేగుతోంది.. అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదని సిట్‌ క్లీన్‌ చిట్ ఇచ్చింది అనే తరహాలో కామెంట్లు చేస్తున్నాయి విపక్షాలు.. అయితే, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సిట్ నివేదికపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపైనా కేబినెట్‌లో చర్చ సాగింది. ఇక, సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయాన్ని అధికారులు కేబినెట్‌కు వివరించారు. దీంతో, సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాతే స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టమైన సూచనలు చేశారు.

Read Also: Ajit Pawar: ‘‘రన్ వే కనిపించడం లేదు’’.. అజిత్ పవార్ చివరి క్షణాల్లో నాటకీయ పరిణామాలు..

Exit mobile version