Site icon NTV Telugu

HM Suspended: విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలిపై వేటు వేసిన ప్రభుత్వం..

Hm Suspended

Hm Suspended

HM Suspended: విద్యార్ధులతో కాళ్లు పట్టించుకున్న ప్రధానోపాధ్యాయురాలిపై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాగా, శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న సుజాత వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.. ఉపాధ్యాయురాలు ఎంతో హుందాగా సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ కుర్చీలో కూర్చిని ఉండగా.. ఇద్దరు విద్యార్థినులు ఆ హెచ్‌ఎం కాళ్లు నొక్కుతున్నారు. ఈ చిత్రాన్ని చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. వైరల్‌గా మారిన ఆ ఫొటోపై సోషల్‌ మీడియాలో పెద్ద దుమారనే రేగింది..

Read Also: England Cricket Contracts 2025: క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం.. ఆ ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు

అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలిపై వేటు వేసింది.. శ్రీకాకుళం జిల్లా బందపల్లి గిరిజన పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న సుజాతను సస్పెండ్‌ చేసింది.. సుజాత విద్యార్ధులతో కాళ్లు పట్టించుకున్నట్లు ఉన్న ఫొటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ఈ ఘటనపై, హెచ్‌ఎం సుజాతపై విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇదే సమయంలో.. సుజాతపై విచారణ పూర్తయ్యే వరకూ ఆమెపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..

Exit mobile version