NTV Telugu Site icon

AP DGP: మెగా లోక్ అదాలత్ను రాష్ట్ర ప్రజలు వినియోగించుకోవాలి..

Ap Dgp

Ap Dgp

ఈరోజు జరిగిన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల ఎస్పీ, సీపీలతో మెగా లోక్ అదాలత్ లో రాజీ పడదగిన కేసులను డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఐపీఎస్ సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగనున్న లోక్ అదాలత్లో అన్ని పోలీస్ స్టేషన్లలో పెండిగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను త్వరిత గతిన పూర్తి చేసి, తగు ఫలితాలు రాబట్టాలని ఆదేశాలు జారీ చేసారు.

Read Also: MP Shocker: “లౌడ్ మ్యూజిక్” ఆర్మీ అధికారులపై దాడి, మహిళపై గ్యాంగ్ రేప్‌కి కారణమైంది..

ఈ సందర్భంగా డీజీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న మెగా లోక్ అదాలత్ కోసం ప్రజలలో అవగహన కల్పించాలి అని చెప్పారు. అదే విధంగా రేపు జరగనున్న మెగా లోక్ అదాలత్ నందు ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. దీనితో పాటు డీజీపీ ఆధీనంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) నందు కూడా ఈ మెగా లోక్ అదాలత్ ను వినియోగించుకొని కేసులను రాజీ చేయాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల ఎస్పీలతో పాటు రేంజ్ ఐజీలు, ఐజీపీ లీగల్, ADD డీజీపీ, సీఐడీ పాల్గొన్నారు.

Read Also: Utsavam Movie Telugu Review : ఉత్సవం రివ్యూ

Show comments