Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా మారిపోయింది జనసేన.. అంతే కాదు.. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం.. జనసేన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది కేంద్ర ఎన్నికల సంఘం. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ పంపించింది కేంద్ర ఎన్నికల సంఘం.. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సృష్టించిన విషయం విదితమే.. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్‌సభ స్థానాల్లో తిరుగులేని విజయాలని అందుకుంది.. ఈ క్రమంలో జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును సైతం రిజర్వ్ చేసుకుంది..
Read Also: Crime: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్‌కి వెళ్లిన బిజినెస్‌మ్యాన్.. 2 రోజుల తర్వాత గదిలో శవం..