NTV Telugu Site icon

TG Bharat: ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. ఫ్యూచర్‌ ఈజ్ లోకేష్‌.. కాబోయే సీఎం..

Tg Bharat

Tg Bharat

TG Bharat: ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్‌ ఈజ్ లోకేష్‌.. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్‌ అని వ్యాఖ్యానించారు మంత్రి టీజీ భరత్‌.. జ్యూరిక్‌లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు ‘మీట్‌ అండ్‌ గ్రీట్’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి టీజీ భరత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా ఫ్యూచర్ ఈజ్‌ లోకేష్.. ఫ్యూచర్‌లో కాబోయే సీఎం లోకేష్‌ అని పేర్కొన్నారు.. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఫ్యూచర్‌ ఈజ్‌ సేఫ్ హ్యాండ్‌ అన్నారు.. పెట్టుబడులు పెట్టేవారికి ఎవరికీ ఎలాంటి భయాలు అవసరంలేదన్నారు.. ఏపీని తెలుగుదేశం పార్టీ కొన్ని దశాబ్దాలు పాలిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..

Read Also: Karnataka : కర్ణాటకలో దారుణం.. 15ఏళ్ల కూతురిని బలవంతంగా 45ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టిన తండ్రి

దీ మోస్ట్‌ డైనమిక్‌, యంగ్‌ లీడర్‌ మా నారా లోకేష్‌ అన్నారు మంత్రి టీజీ భరత్‌.. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి.. ఏపీ నుంచి ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి చదవిని వ్యక్తి లోకేష్‌ మినహా ఎవరూ లేరని తెలిపారు.. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది మాకు లాంగ్‌ విజన్‌ ఉంది.. ఫ్యూచర్‌ తెలుగుదేశం పార్టీకి ఉంది.. మా పార్టీలో క్లారిటీ ఉంది.. ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా.. ఫ్యూచర్‌ ఈజ్‌ లోకేష్‌.. కాబోయే ముఖ్యమంత్రి లోకేష్‌.. ఫ్యూచర్‌లో అని స్పష్టం చేశారు.. ఇక, కేంద్ర కేబినెట్‌లో రామ్మోహన్‌నాయుడు యంగెస్ట్‌ మినిస్టర్‌ లని తెలిపారు.. ప్రతి జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌ రావాలనే ప్రణాళికలు పెట్టుకున్నారు.. త్వరలోనే మా కర్నూలు నుంచి కూడా విజయవాడకు విమానంలో వెళ్లేందుకు ఏర్పాటు చేయాలని.. ఈ వేదిక నుంచి కూడా కోరుతున్నట్టు వెల్లడించారు.. అయితే, లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఎవరూ మాట్లాడవద్దు అంటూ టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిన రెండు గంటల్లోనే టీజీ భరత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. దావోస్‌ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ముందే ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్‌.. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..