Site icon NTV Telugu

Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌..!

Telangana Cabinet

Telangana Cabinet

Telangana Cabinet Meeting: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ సమావేశమవుతుంది. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్‌ ముసాయిదాపై చర్చిస్తుంది. దీంతో పాటు సిగాచి పరిశ్రమలో అగ్నిప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదిక, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాల సవరణ, సీతారామ ప్రాజెక్టు, SRSP ప్రాజెక్టు పనులపైనా చర్చించబోతోంది మంత్రివర్గం.

Read Also: Mega Star : బాబీ – చిరు కాంబో ఫిక్స్.. శ్రీకాంత్ ఓదెల సినిమా లేనట్టేనా.?

ఇక, ఇవాళే కాళేశ్వరం కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉంది. నివేదిక అందితే కేబినెట్ భేటిలో యథావిధిగా జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. జూలై 31తో కమిషన్ పదవీకాలం ముగియనుండటంతో ఆలోపే కాళేశ్వరం నివేదిక ఇవ్వాలని కమీషన్ చైర్మన్ ఘోష్ నిర్ణయించారు. ఇప్పటికే విద్యుత్ సంస్థలో అక్రమాలకు సంబంధించి జస్టిస్ మదన్ భీమ్‌రావ్ లోకూర్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఘోష్ నివేదిక అందితే రెండు కమిషన్ రిపోర్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. ఆమోదం తర్వాత రెండు కమిషన్ల రిపోర్టుపై తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది.

Read Also: Ind vs Eng, 4th Test: డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్.. సుందర్-జడేజా చారిత్రాత్మక ఇన్నింగ్స్

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చించే అవకాశం ఉండగా.. గోశాలల పాలసీ, ఇందిరమ్మ ఇళ్లు, యూరియా లభ్యత, రేషన్‌కార్డుల పంపిణీ, చొక్కారావు ఎత్తిపోతల పథకం పనులు, రవాణా శాఖ పన్నుల వసూలు సవరణ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు, హైదరాబాద్ కు చేరుకున్న కాళేశ్వరం కమీషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. జూలై 31తో పీసీ ఘోష్ కమీషన్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. ఈ రోజే ప్రభుత్వానికి కాళేశ్వరం కుంగుబాటుపై నివేదిక పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది.

Exit mobile version