TDP vs YSRCP: ఏపీలో మెడికల్ కాలేజీల అంశం హాట్ టాపిక్‌గా మారింది.. కూటమి ప్రభుత్వం పది ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆదోని.. మదనపల్లె. మార్కాపురం.. పులివెందుల.. పెనుగొండ.. పాలకొల్లు.. అమలాపురం.. నర్సీపట్నం.. బాపట్ల.. పార్వతీపురంలో ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్‌షిప్ తో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వీటిలో నాలుగు కాలేజీలు మొదటి దశ లో ప్రారంభం కానున్నాయి.. పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.. ఇక్కడే అసలు గొడవ మొదలయింది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది..ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడం కోసమే ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో కాలేజీలు ఏర్పాటు చేస్తోందని.. విమర్శలు చేస్తోంది.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. తాము 17 మెడికల్ కాలేజీలు తెస్తే. 5 ప్రారంభం అయ్యాయన్నారు. 4 వేలకు పైగా సీట్లు అందుబాటులో కి వచ్చాయన్నారు జగన్.. కేవలం ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు ధరదత్తం చెయ్యడానికి మాత్రమే పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తోందన్నారు జగన్.. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమి కూడా ప్రైవేట్ పరం అవుతోందని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని విమర్శలు చేస్తున్నారు.. మెడికల్ కాలేజీల ఏర్పాటు వెనక పెద్ద స్కామ్ ఉందన్నారు.. పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీల ఏర్పాటు ను తాము వ్యతిరేకిస్తున్నాం అన్నారు విడుదల రజని.. సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే పేద వాళ్ల పరిస్థితి ఏంటన్నారు రజని.
Read Also: E-Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ..కేటీఆర్ పై మళ్లీ దృష్టి
అయితే, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వం చెబుతోంది.. ఆసుపత్రులు ప్రైవేట్ పరం అంటూ విషం ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కోల్పోయి రాష్ట్రంలో నిత్యం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలోనే వైసీపీ ఉందని.. తాజాగా మళ్లీ మెడికల్ కాలేజీలపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది.. తాను 17 మెడికల్ కాలేజీలు కడితే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌పరం చేస్తుందని విష ప్రచారానికి జగన్ తెర తీశారని.. పీపీపీ విధానం లో మెడికల్ కాలేజ్ లు పూర్తి చేసి సీట్లు అందుబాటులోకి తెస్తుంటే ప్రైవేట్ పరం అంటూ గగ్గోలు పెడుతున్నారని ప్రభుత్వం మండిపడుతోంది.. జగన్ తన హయాంలో పూర్తి చేయని మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తుందో వైసీపీ, జగన్ చెప్పాలంటున్నారు టీడీపీ నేతలు.. ప్రభుత్వం కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నారు. పీపీపీ విధానం ద్వారా నిర్మాణాల్లో వేగం పెరుగుతుందని.. నిర్మాణం పూర్తైన అనంతరం కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉందంటున్నారు. పీపీపీ విధానంలో నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలో కనీసం 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు టీడీపీ నేతలు..
Read Also: Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందే.. పాకిస్తాన్ బౌలర్ రిటైర్మెంట్!
వాస్తవాలను పక్కన పెట్టి రూ.8,500 కోట్ల విలువైన కాలేజీలను రూ.5,000 కోట్లకు బినామీలకు లీజుకు ఇస్తున్నారని వాస్తవాలను దాచి వక్రీకరణ చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. కేంద్రం 2019-24 మధ్య కాలంలో కొత్త విధానంలో భాగంగా రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజ్ లు మంజూరు చేసిందని.. తాను 17 కాలేజీలు తెచ్చాను అని చెప్పుకున్న జగన్ ఒక్క దానిని కూడా పూర్తి చెయ్యలేదు అని టీడీపీ వెర్షన్. అన్ని కాలేజ్ లకు కలిపి రూ.8500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా కేవలం 17 శాతం మాత్రమే ఖర్చు పెట్టారని.. అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో అరకొర వసతులతోనే కళాశాలలు ప్రారంభం అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. వైసీపీ హయాంలో 5 కాలేజీలు నిర్మించినట్లు చెప్పుకొంటున్న కాలేజీల్లోనూ కనీసం సిబ్బందిని కూడా నియమించని పరిస్థితి ఉందని ప్రభుత్వం చెబుతోంది. మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ కళాశాలల నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. NMC నిబంధనలకు అనుగుణంగా కాలేజీలను అప్‌గ్రేడ్ చేసి, ఏడాదిలో కనీసం ఒక్కొ కాలేజ్ లో 100 MBBS సీట్లతో కళాశాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..
