NTV Telugu Site icon

Pattabhiram: ఏపీలో సమ్మె చేయని కార్మిక వర్గం లేదు..

Pattabi

Pattabi

Pattabhiram: ఏపీలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. ఏపీలో సమ్మె చేయని కార్మిక వర్గం లేదని ఆరోపించారు. అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, 108-104 అంబులెన్సుల ఉద్యోగులు సమ్మెలోనే ఉన్నారని తెలిపారు. వారి డిమాండ్ల మొత్తం విలువ జగన్ రెడ్డి తన విలాసాల కోసం తగలేసినంత ఉండొచ్చని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ అమలు కోసం పోరాడుతున్న వారిపై లాఠీలు ఝళిపించి, ఎస్మా చట్టాలు ప్రయోగిస్తారా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. తన భోగాల కోసం జగన్ రెడ్డి.. నిర్మించిన రుషికొండ ప్యాలెస్ విలువ కూడా చేయదు, అంగన్ వాడీ సిబ్బందికి తాను ఇచ్చిన హామీ ఖరీదు ఎంత అని అన్నారు.

Read Also: Minister Karumuri: మా ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు..

గత ఎన్నికల సమయంలో జగన్.. అంగన్ వాడీ సిబ్బందికి తెలంగాణలో కంటే రూ.1000 అదనంగా జీతం చెల్లిస్తానని హామీ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. నేడు తెలంగాణలో అంగన్ వాడీ సిబ్బందికి ప్రతినెలా రూ.13,600 ఇస్తుంటే, మాట ప్రకారం జగన్ రెడ్డి రూ.14,600లు ఇవ్వాలన్నారు. కానీ ఇస్తున్నది రూ.11,500లు మాత్రమేనని తెలిపారు. మరోవైపు.. అరబిందో సంస్థకు వేలకోట్ల విలువైన రామాయపట్నం పోర్టు, సోలార్ పవర్ పార్కులు ఎలా దోచిపెడతావు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు?. 60 శాతం నిధులు కేంద్రమే భరిస్తుంటే, రాష్ట్ర వాటాగా 40 శాతం నిధులు చెల్లించకుండా.. జగన్ రెడ్డి సర్వశిక్షా అభియాన్ సిబ్బంది జీతాలకు ఎగనామం పెట్టాడని పట్టాభిరామ్ మండిపడ్డారు.

Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌజ్‌లోకి ఇద్దరు అపరిచితులు..