Site icon NTV Telugu

YS Viveka Murder Case: సుప్రీం కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ.. ఆ కేసులు క్వాష్‌..

Ys Viveka

Ys Viveka

YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ ఎం ఎం సుందరేష్‌, ఎంకే సింగ్ ల ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.. ఈ కేసులో తదుపరి సీబీఐ విచారణ అవసరమా? లేదా? అనేదానిపై సమయం కోరారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కే ఎస్ ఎన్ రాజు.. దీంతో, తదుపరి విచారణ పై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.. కాగా, వైఎస్‌ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి బెయిల్ తో పాటు ఇతరుల బెయిళ్లను రద్దు చేయమలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ సునీతా రెడ్డి… నిందితులు కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వాదనలు వినిపించారు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఇక, ఈ హత్యకేసులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించింది సీబీఐ.. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. బెయిల్ లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది సీబీఐ.. అయితే, సునీత దంపతులపై, సీబీఐ అధికారి రాంసింగ్ పై పెట్టిన కేసును క్వాష్ చేసింది సుప్రీంకోర్టు..

Read Also: Asia Cup 2025: ఈసారి ఆసియా కప్‌ మాదే.. బంగ్లా బ్యాటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Exit mobile version