Minister Anagani Satya Prasad: భూ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. భూదందాలపై ఉక్కు పాదం మోపుతామంటూ ఓ ప్రకటనలో హెచ్చరించారు.. ఇప్పటికే భూదురాక్రమణ (నిరోధక) చట్టం 2024ను తీసుకొచ్చాం.. వైఎస్ జగన్ రెడ్డి అరాచకపాలనలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రజల ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు.. కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణగా పేర్కొన్న ఆయన.. భూ దందాలపై కూటమి ప్రభుత్వానికి దాదాపు 10 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.. ఈ నెల ఆరో తేదీ నుండి జరగనున్న రెవిన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చు అని సూచించారు.. అయితే, భూ దందాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవు అని స్పష్టం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
Read Also: Maharashtra: డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన షిండే.. ఎల్లుండి సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం..!
కాగా, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-1982 స్థానంలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్-2024కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం విదితమే.. వైసీపీ హయాంలో భూ కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు సుదీర్ఘంగా గతంలో చర్చించారు..వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు చేసిన విచ్చలవిడి భూ దందాలపై ప్రభుత్వం దృష్టిసారించింది.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గొప్ప మైలురాయిగా నిలుస్తుందని.. భూములు కబ్జా చేసే వారి గుండెల్లో ఈ చట్టం రైళ్లు పరిగెత్తిస్తుందని గతంలోనే ప్రకటించారు మంత్రి అనగాని సత్యప్రసాద్..