NTV Telugu Site icon

Social Media Posts: ఏపీ బ్రాండ్‌ దెబ్బతీసేలా సోషల్‌ మీడియా పోస్టులు.. సర్కార్‌ సీరియన్‌ యాక్షన్‌..!

Ap

Ap

Social Media Posts: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై సోషల్‌ మీడియా వేదికగా విష ప్రచారం జరుగుతుంది.. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను దెబ్బతీసేలా కూడా పోస్టులు పెడుతున్నారట.. అయితే, ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా వస్తున్న కొన్ని సోషల్ మీడియా పోస్టింగులపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.. ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దనే రీతిలో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిపై నిఘా పెట్టింది సర్కార్‌..

Read Also: Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’లో అనుపమ్ ఖేర్

యూట్యూబ్ అకాడమీ పెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు గండి కొట్టేలా.. వైసీపీ అనుకూల సోషల్ మీడియా.. దానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతోందని గుర్తించారట అధికారులు.. ఏపీలో శాంతి భద్రతలు సరిగా లేవంటూ యూట్యూబ్, గూగుల్ సంస్థలను ట్యాగ్ చేస్తూ పోస్టింగులు పెట్టడంపై ప్రభుత్వం గుర్రుగా ఉంది.. పెట్టుబడులు పెట్టాలన్నా, అకాడమీ పెట్టాలన్నా హైదరాబాద్ కు వెళ్లండంటూ సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇస్తున్నారు.. రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగాయి అంటూ ఇప్పటికే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతోంది ప్రభుత్వం.. తమ అనుమానాలకు బలం చేకూర్చేలా వైసీపీ సోషల్ మీడియా పోస్టింగులున్నాయంటున్నారు ప్రభుత్వ పెద్దలు.. ఏపీకి పెట్టుబడులు రాకుండా, సంపద సృష్టి జరగకుండా వైసీపీ పన్నాగాలు పన్నిందంటూ చంద్రబాబు సర్కార్‌ ఫైర్‌ అవుతోంది.

Show comments