Site icon NTV Telugu

CM Chandrababu: సీఎం అధ్యక్షతన SIPB సమావేశం.. 15 ప్రాజెక్టుల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్..!

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డ్ 3వ సమావేశం జరగనుంది.. 15 ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనుంది SLPB.. రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది సమావేశం.. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాలు కల్పన టార్గెట్‌గా ప్రభుత్వం ప్రణాళికలు పెట్టుకుంది.. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైనా చర్చ సాగనుంది.. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు.. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు సీఎం.. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు సీఎం.. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్ధాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు.. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని కీలక సహాలు ఇచ్చారు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు..

Read Also: GHMC Council Meeting: బడ్జెట్‌ ప్రవేశపెట్టిన జీహెచ్‌ఎంసీ మేయర్‌.. కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం!

Exit mobile version