Site icon NTV Telugu

Single-use Plastic Ban: అక్టోబర్ 2 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం.. సర్కార్‌ ఆదేశాలు

Ban On Single Use Plastic

Ban On Single Use Plastic

Single-use Plastic Ban: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి రానున్నట్టు పేర్కొంది.. ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.. 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్దేశం చేశారు.. వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబరిచే వారికి ‘స్వచ్ఛత’ అవార్డులు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు..

Read Also: Bajaj Chetak 3001: ఒక్కసారి ఛార్జింగ్ తో 127 కి.మీ. రేంజ్‌.. కొత్త EV చేతక్ 3001 విడుదల..!

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘సర్క్యులర్ ఎకానమీ’పై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ సాగింది..

Read Also: Govt Schools: ప్రభుత్వ టీచర్ల పిల్లలు కార్పోరేట్‌కు.. సర్కారు బడి బాగుపడేదెలా సారూ..?

మరోవైపు, ప్రణాళిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఏపీ ఎకానమీ, గ్రోత్ డ్రైవర్స్, జీఎస్డీపీ ప్రొజెక్షన్స్, కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్లపై సమీక్ష చేశారు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయికి మించి ఏపీ తలసరి ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు.. 2024-25కు జాతీయ స్థాయిలో సరాసరి తలసరి ఆదాయం 8.7 శాతంగా ఉంటే.. ఏపీ 11.89 శాతం నమోదు చేసిందని అధికారులు తెలిపారు.. తలసరి ఆదాయం, జీఎస్డీపీ, రాష్ట్రాదాయాలు ఎలా పెరుగుతాయనే అంశంపై అంచనాలు రూపొందించాలన్నారు సీఎం.. రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలంటే ఏం చేయాలనే దానిపై డేటా అనలిటిక్స్ చేయాలన్నారు.. సేవల రంగం అభివృద్ధి జరిగేలా దృష్టి పెడితే ఆర్థిక సుస్థిరతను సాధించగలమన్నారు.. గ్రామస్థాయిలో కూడా కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లు పెడితే.. క్షేత్ర స్థాయిలో పోటీ తత్వం పెరుగుతందని చెప్పారు.. 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు చేయడంతో పాటు.. పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు..

Exit mobile version