NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy Resignation Letter: బాలినేని రాజీనామా లేఖలో సంచలన అంశాలు.. రాజకీయ నిర్ణయాలు సరిగా లేవు..!

Balineni

Balineni

Balineni Srinivasa Reddy Resignation Letter: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌కు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే మాజీ మంత్రులు, సిట్టింగ్‌ ఎంపీలు.. ఇలా కీలక నేతలకు పార్టీకి గుడ్‌బై చెప్పగా.. ఇప్పుడు వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.. బంధువు అయిన.. కీలక నేత.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి సైతం పార్టీని వీడారు.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాసిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు..

Read Also: Kumari Aunty : ముఖ్యమంత్రి సహాయనిధికి కుమారి ఆంటీ విరాళం.. ఎంతంటే..!

ఇక, బాలినేని రాజీనామా లేఖ విషయానికి వస్తే.. ”కొన్ని కారణాల రీత్యా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనా చేస్తున్నాను.. రాష్ట్ర ప్రగతి పథంలో వెళ్తే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను.. కారణం అంతిమంగా ప్రజాశ్రేయస్సే రాజకీయాలకు కొలమానం కదా? విలువలను నమ్ముకొనే దాదాపు ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశాను అన్న తృప్తి. కొంత గర్వం కూడా ఉంది.. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు.. వైఎస్‌ఆర్‌ కుటుంబానికి సన్నిహితుడిని అయినా.. ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకొన్నా.. ఎలాంటి మోహమాటాలకు నేనే పోలేదు.. అంతిమంగా ప్రజా తీర్పును ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే.. నేను ప్రజా నాయకుడిని. ప్రజల తీర్పే నాకు శిరోధార్యం.. రాజకీయాల్లో భాష గౌరంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం నేను చేశాను.. కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకొనప్పుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే.. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేశాను”.. అందరికీ ధన్యవాదాలు.. అంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి..

బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా లేఖ…