NTV Telugu Site icon

IPS officer Sunil Kumar: వివాదంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్..

Sunil Kumar

Sunil Kumar

IPS officer Sunil Kumar: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ విషయమై ట్విట్టర్‌ వేదికగా (ఎక్స్‌) స్పందించిన సునీల్.. ‘‘ఆ కేసు సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచిందని.. సాక్షాత్ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని’’ అంటూ రాసుకొచ్చారు. అయితే, సోషల్ మీడియాలో సునీల్ కుమార్‌ ఈ విధంగా పోస్ట్ పెట్టడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు.. ఎఫ్ఐఆర్ నమోదుపై ఈ రకమైన పోస్టులు పెట్టడం ప్రభుత్వాన్ని ధిక్కరించడమే అవుతుందంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇది, ఆల్ ఇండియా కండక్ట్ రూల్స్‌లోని రూల్ నెంబరు 7ను ఉల్లంఘించడమే అంటుంది టీడీపీ.. మరోవైపు ఐపీఎస్‌ సునీల్ కుమార్‌ పోస్ట్ పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది టీడీపీ.. సునీల్ కుమార్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టును పరిగణలోకి తీసుకుని సస్పెండ్ చేయాలని తన ఫిర్యాదులో పేర్కొంది టీడీపీ.

Read Also: Snake Bites: మరోసారి పాము కాటుకు గురైన వ్యక్తి.. 40 రోజుల్లో ఏడోసారి

ఐపీఎస్‌ పీవీ సునీల్ కుమార్‌ పై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.. దీంతో, గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు సునీల్‌ కుమార్‌పై కేసు నమోదు చేశారు. అయితే, గత ప్రభుత్వంలో సునీల్ సీఐడీ డీజీగా పని చేసిన సునీల్‌ కుమార్.. అప్పట్లో ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజును కస్టడీకి తీసుకున్న సమయంలో కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని, చిత్ర హింసలు పెట్టారనే అభియోగాలు ఉన్నాయి.. ఈ విషయాన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామ కృష్ణంరాజు.. దీంతో సునీల్‌ కుమార్‌తో పాటు పలువురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

https://x.com/PV_Sunil_Kumar/status/1811645292069937279