NTV Telugu Site icon

Sajjala Ramakkrishna Reddy: తప్పుడు కేసులతో భయపడేది లేదు.. లుకౌట్ నోటీసులపై..!

Sajjala

Sajjala

లుకౌట్ నోటీసులపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. విదేశాల నుంచి వస్తుంటే ఏపీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారం చేస్తున్నారు.. తప్పు చేసి నేను తప్పించుకునే ప్రయత్నం చేశారని పైత్యంతో వార్తలు రాస్తున్నారని సజ్జల ఆరోపించారు. కుటుంబంతో ఈ నెల 7న ఢిల్లీ నుంచి వెళ్ళాను.. తిరిగి 14న ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో దిగి విజయవాడ వచ్చేందుకు సిద్ధం అవుతుండగా ఆపారని తెలిపారు. గుంటూరు ఎస్పీ నుంచి లోక్ వచ్చిందని చెప్పారు.. రీజన్ మాత్రం చెప్పలేదన్నారు. లుక్ ఔట్ నోటీసు అనేది వెళ్ళేటపుడు చేయాల్సి ఉంటుంది.. ఇక్కడ పోలీసులతో మాట్లాడాను.. హైకోర్టులో కేసు నడుస్తోందని ఈలోపు తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు ఉన్నాయని చెప్పానని సజ్జల పేర్కొన్నారు.

Nigeria: నైజీరియాలో ఘోరం.. పెట్రోల్‌ ట్యాంకర్ పేలి 100 మంది మృతి

రూల్స్ పాటించాల్సి ఉన్నప్పటికీ వాటిని ఇక్కడ పాటించటం లేదు.. కోర్టు ద్వారా తాను ముందుకు వెళ్తానని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. 10-10-2024లో లుక్ ఔట్ నోటీసు ఇచ్చారు.. తాను ఏడో తేదీ వెళ్లిన తర్వాత నోటీసు సిద్ధం చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ మాదిరి పారిపోము.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల వంటి నేతలపై కేసులు పెట్టిన చర్యలు విచారణ చేశాం.. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని సజ్జల తెలిపారు. ఏపీలో ప్రభుత్వం ఉందా..? అరాచకానికి హద్దు అనేది లేదా.. రెడ్ బుక్ కంటే వరస్ట్గా నడుస్తోందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును జగన్ కక్ష పూరితంగా అరెస్టు చేయలేదు.. సిట్ నివేదిక ఆధారంగా మాత్రమే అరెస్టు జరిగింది అనేది ఈడీ చర్యలతో స్పష్టం అయిందని సజ్జల తెలిపారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్టు చేయలేదు.. విచారణ జరిపి చేశారన్నారు. ముంబై నటి కేసులో కూడా స్టేట్‌మెంట్ రికార్డు కావాలని రికార్డు చేసి అరెస్టులు కేసులు పెడుతున్నారని సజ్జల తెలిపారు. మరోవైపు.. టీడీపీ ఆఫీసు కేసులో కూడా ఇలానే తన పేరు నమోదు చేశారన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కూడా కావాలని ప్లానింగ్ ప్రకారం రెచ్చగొట్టి చేసినట్టు అనిపిస్తుంది.. ఒకవైపు అరెస్టులు చేస్తుంటే మరోవైపు సీఐడీకి కేసు అప్పగించారని పేర్కొన్నారు. కార్యకర్తల మొదలు జగన్ సహా తప్పుడు కేసులు పెట్టడం జరుగుతోంది.. ఎన్నికల హామీలు వదిలేసి మేం ఏం చేయమనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు అనిపిస్తోందని ఆరోపించారు. వేధింపులు మాత్రం తీవ్ర స్థాయికి తీసుకువెళ్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.