Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధానిపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. మా విధానం అదే..!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: అమరావతిపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే ఖర్చు తక్కువ అవుతుందన్నారు.. అయితే, ఇంతకు ముందు అమరావతిని రాజధానిగా తీసేస్తామని మేం అనలేదన్నారు.. అమరావతిని కలుపుకొని ఢీసెంట్రలైజ్ అన్నాం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అన్నాం.. మూడు రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారన్నారు.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే శాశ్వత పరిష్కారం అవుతుందున్నారు.. చంద్రబాబు తాను, తన కొఠారి జేబులు నింపుకునే ఆలోచన చేస్తున్నారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.. అమరావతిని మాయా బజారులాగా కట్టాలని అంటే లక్ష ల కోట్లు ఖర్చు అవుతుంది.. రాష్ట్రం భరించలేనంత ఖర్చు రాజధానికి అవుతుంది.. చంద్రబాబు రాజధానిని అప్పులు పాలు కాకుండా చూడాలని సలహా ఇచ్చారు.

Read Also: Mirai : బాహుబలి తర్వాత మిరాయ్ సినిమానే.. ఆర్జీవీ సంచలనం..

కేంద్రం రాజధానికి డబ్బు ఇస్తే ఎవరికి అభ్యంతరం లేదు.. కానీ, చంద్రబాబు లోను తీసుకోని రాజధాని కడుతున్నారని విమర్శించారు సజ్జల.. అమరావతిని జగన్ అభివృద్ధి చేశారన్న ఆయన… మేం పరిపాలన రాజధాని విశాఖ, న్యాయ రాజధాని కర్నూల్ అనుకున్నాం.. కానీ, మేం అనుకున్నది జరగలేదు.. అమరావతి ప్రాంతంలో రాజధాని కంటిన్యూ అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.. అయితే, రాజధాని నిర్మాణం చంద్రబాబు చేతిలో ఉంది.. రాజధాని పూర్తి కాకపోతే వేరే ఆలోచన వచ్చే అవకాశం ఉందన్నారు.. మరోవైపు, రాజధాని మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు సజ్జల.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే మహా నగరం తయారు అవుతుంది.. 500 ఎకరాల్లో రాజధాని సరిపోతుందని వైఎస్ జగన్ గతంలోనే చెప్పారు.. ఈ ప్రాంతంలో ఇప్పటికే పశ్చిమ బైపాస్ అందుబాటులో ఉంది.. తూర్పు బైపాస్ కూడా అందుబాటులోకి వస్తుంది.. దగ్గరలోనే బందరు పోర్టు కూడా ఉంది.. ఇటువైపు అయితే త్వరగా ఒక మహానగరం రెడీ అవుతుందన్నారు సజ్జల..

Read Also: UP: తన ప్రైవేట్ పార్టును తానే కోసుకున్న యూపీఎస్సీ విద్యార్థి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు.. చంద్రబాబు లాండ్ పూలింగ్ అంటే అనుమానాలు వస్తున్నాయన్నారు సజ్జల.. లక్షల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు..? అని ప్రశ్నించారు.. రాజధాని కంటిన్యూ చేయడం చంద్రబాబు చేతిలోనే ఉందన్నారు.. రాజధాని పనులు త్వరగా పూర్తి చేస్తే కొత్త ఆలోచనలు రావు.. రాజధాని కాకపోయినా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం అన్నారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి..

Exit mobile version