Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది.. ప్రజల్లో, పార్టీ క్యాడర్‌ లో ఇదే చర్చ జరుగుతోందన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ సజ్జల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీలో క్రియాశీలక విభాగంలో ఉన్న అందరి పాత్ర చాలా కీలకమైంది.. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు మించి స్థానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు.. అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించాం.. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే గ్రాస్‌ రూట్‌ లెవల్‌లో బలంగా ఉండాలని సూచించారు.. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది.. కానీ, ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?

చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలుచేయడం లేదు.. లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా నాశనం అయింది అని విమర్శించారు సజ్జల.. సామాన్యులు కూడా బలవుతున్నారు.. గవర్నెన్స్‌ పూర్తిగా బ్రష్టుపట్టింది.. మళ్లీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు ఎవరి స్థాయిలో వారు అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక, ఈ ఏడాదిలో 1.67 లక్షల కోట్ల అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం.. అమరావతిలో 40 వేల ఎకరాలు చాలవన్నట్లు మరో 40 వేల ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరుతో దోపిడీ నేరుగా పదిశాతం కమిషన్‌ తీసుకుంటున్నారు.. వేలకోట్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ప్రజల ఆకాంక్షలు, కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతోందని ఆరోపించిన ఆయన.. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రజలే నిలదీసేలా మన కార్యాచరణ ఉండాలన్నారు.. ప్రజలను చైతన్యం చేయడానికి అవసరమైన కార్యక్రమాలు చేయాలి.. వైసీపీ క్రియాశీలక సైన్యంగా 18 లక్షల మంది సిద్ధమవుతారు.. టెక్నాలజీని ఉపయోగించుకుని మన వాయిస్‌ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Exit mobile version