Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: ఇదే మనకు మంచి అవకాశం.. ఏ మాత్రం జాప్యం తగదు..

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి సహా బీసీ కులాల సాధికార అధ్యక్షులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది జగన్ మాత్రమే.. అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పోరేషన్లు సైతం ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు.

Read Also: Rain Alert : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక – వచ్చే 4 రోజులు జాగ్రత్త

ఒక సమగ్ర విధానం ద్వారా బీసీలందరికీ అభివృద్ధి ఫలాలను అందించిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ మాత్రమే అని కొనియాడారు సజ్జల రామకృష్ణారెడ్డి.. బీసీలందరినీ చైతన్య పరిచి మళ్లీ ఏకతాటి మీదకు తీసుకురావాలన్న ఆయన.. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని అందరికీ వివరించాలని సూచించారు.. బీసీల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.. ఇక, రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై విసుగు చెందారని వ్యాఖ్యానించారు.. బీసీ కులాలకు ఒక ఉనికిని తీసుకొచ్చింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే, బీసీ కులాలకు గుర్తింపును, సమాజంలో చైతన్యంను తీసుకొచ్చి వైభవం తీసుకొచ్చి పెద్దపీట వేసింది వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వెనుకబడిన కులాలకు ఒక సమగ్ర విధానం తీసుకొచ్చి అందరికీ అభివృద్ది ఫలాలు అందాలని జగన్‌ హయాంలో మేలు చేశారు. ప్రతిపక్షం అనేది మనకు ఒక మంచి అవకాశం, వెనకబడిన కులాలు అందరినీ చైతన్యపరిచి, జగన్‌ వల్ల మనకు భవిష్యత్‌ ఉంటుందనే చైతన్యం అందరిలో తీసుకురావాలి, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి, ఇక ఏ మాత్రం జాప్యం తగదు. జగన్‌ ఆలోచనలు, విధానాలను మీమీ బీసీ కులాల్లోకి మరింతగా తీసుకెళ్ళాలి. అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఐదేళ్ళలో మనం ప్రజలకు చేసిన మంచి ఎక్కడికీ పోలేదు, అందరికీ అర్థమవుతోందన్నారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.

Read Also: World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే!

బీసీలంటే బ్యాక్ వర్డ్‌ క్లాస్‌ కాదు బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని జగన్‌.. బీసీలకు రాజకీయంగా సముచిత స్ధానం కల్పించారు అని తెలిపారు రాచగొల్ల రమేష్‌ యాదవ్‌.. జగన్‌ మళ్ళీ సీఎం చేసుకునేందుకు మన బీసీ కులాలంతా ఏకం కావాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెనకబడిన కులాలకు జరిగిన మేలు ఎవ్వరూ మరిచిపోరు. కూటమి ప్రభుత్వం బీసీలను వంచిస్తుంది, అబద్దపు హామీలు, మాయమాటలతో కూటమి ప్రభుత్వం మన బీసీలను నిలువునా ముంచిందని మండిపడ్డారు రమేష్ యాదవ్.. ఇక, బీసీలకు జగన్‌ చేసిన మేలు ఎవరూ మరిచిపోరు, మనమంతా జగన్‌ ని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. నాడు దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి బీసీలకు చేసిన మేలు ఆ తర్వాత జగన్‌ మాత్రమే మన బీసీ కులాలకు న్యాయం చేసి మనల్ని గుర్తించారు. బీసీలంతా ఐక్యంగా మనకు అప్పజెప్పిన బాధ్యతలు నిర్వర్తించి మనం ఐకమత్యంగా జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం అన్నారు నౌడు వెంకటరమణ.

Exit mobile version