Site icon NTV Telugu

PM Modi AP Tour: ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ.. టూర్ వివరాలు ఇదిగో..

Modi8

Modi8

PM Modi AP Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రాబోతున్నారు.. ఈసారి మోడీ పర్యటన రాయలసీమల ప్రాంతంలో కొనసాగనుంది.. వచ్చే నెల అంటే అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రానికి రానున్నారు ప్రధాని.. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం వెళ్లనున్న ప్రధాని మోడీ.. శ్రీశైలం మల్లికార్జునస్వామితో పాటు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకున్న తర్వాత.. కర్నూలులో నరేంద్ర మోడీ రోడ్‌షో నిర్వహించనున్నారు..

Read Also: Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదల

జీఎస్టీ శ్లాబులలో కీలక మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలను అమల్లోకి తెచ్చింది ఈ నేపథ్యంలో.. జీఎస్టీ సంస్కరణలపై కూటమి నేతలతో కలిసి రోడ్‌షోలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ.. ఈ రోడ్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్నారు.. ప్రధాని మోడీ రోడ్‌షో సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూటమి నేతలు సన్నహాలు చేస్తున్నారట.. ఇక, ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రి నారా లోకేష్‌. శాసనమండలి లాబీలో మంత్రులు, ఎమ్మెల్సీల వద్ద ప్రస్తావించారు. అయితే, ప్రధాని మోడీ ఏపీ టూర్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రావాల్సి ఉంది..

Exit mobile version