NTV Telugu Site icon

PM Modi: చంద్రబాబు తన ట్రాక్‌ రికార్డు నిరూపించుకున్నారు.. మోడీ ప్రశంసలు..

Pm Modi

Pm Modi

PM Modi: దేశ ప్రజలు ఎన్డీయేపై పూర్తి విశ్వాసం చూపిస్తున్నారు.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది.. నిజమైన అభివృద్ధిని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో చూడొచ్చు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని.. బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర నిర్వహించిన విజయోత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఎన్డీఏ కూటమిలోని సీఎంల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.. బీహార్‌లో నితీష్‌ కుమార్‌, ఏపీలో చంద్రబాబుతో కలిసి ఘన విజయం సాధించామన్న మోడీ.. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్‌ రికార్డును నిరూపించుకున్నారంటూ ప్రశంసలు కురిపించారు..

పూర్వాంచల్‌ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ.. నేను పూర్వాంచల్‌ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నాను అన్నారు.. ఢిల్లీ ప్రజలకు ఆప్‌ నుంచి విముక్తి లభించింది.. ఢిల్లీ ప్రజలకు ఈ రోజు పండగలాంటిది.. మాపై విశ్వాసం ఉంచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు.. మీ విశ్వాసాన్ని అభివృద్ధి రూపంలో తీసుకొస్తాం అని హామీ ఇచ్చారు.. ఇకపై ఢిల్లీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో ఢిల్లీలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది.. ఈ విజయం కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడ్డారు.. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను తిరిగి అనేక రెట్లు వారికిస్తాం.. ఢిల్లీలో విజయం సాధారణమైన విజయం కాదని అభివర్ణించారు..

పదేళ్లు ఢిల్లీని అహంకారంతో పరిపాలించారని ఆమ్‌ఆద్మీ పార్టీపై ఫైర్‌ అయ్యారు ప్రధాని మోడీ.. షార్ట్‌కట్‌ రాజకీయాలకు ఢిల్లీ ప్రజలు షార్ట్‌ సర్క్యూట్‌ ఇచ్చారి పేర్కొన్నారు.. ఇక నుంచి ఢిల్లీలో వికాస్‌, విజన్‌, విశ్వాస్‌ నినాదంతో పరిపాలన.. ఈ ఎన్నికల్లో నిజమైన విజేతలు ఢిల్లీ ప్రజలే.. హర్యానా, మహారాష్ట్రలో గెలిచి రికార్డు సృష్టించాం.. ఢిల్లీ విజయంతో కొత్త చరిత్ర సృష్టించాం.. ఢిల్లీ ఒక పట్టణం కాదు.. ఢిల్లీ అనేది మినీ ఇండియాగా అభివర్ణించారు.. దేశ ప్రజలు ఎన్డీయేపై పూర్తి విశ్వాసం చూపిస్తున్నారు.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది.. నిజమైన అభివృద్ధిని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో చూడొచ్చు.. బీహార్‌లో నితీష్‌, ఏపీలో చంద్రబాబుతో కలిసి ఘన విజయం సాధించాం.. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్‌ రికార్డును నిరూపించుకున్నారని పేర్కొన్నారు.. కోట్లాది మంది మహిళలు ఎన్డీయే ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నారు.. మోడీ గ్యారెంటీ ఇచ్చాడంటే.. అది నెరవేరి తీరుతుంది.. ఢిల్లీని అత్యున్నత నగరంగా తీర్చి దిద్దుతాం.. ఢిల్లీ భారత్‌కు ముఖ ద్వారం అన్నారు..

ఇక, ఢిల్లీ ఫలితాలతో కాంగ్రెస్‌ కు ఒక్కసీటు కూడా రాకపోవడంపై స్పందించిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్‌ జీరో హ్యాట్రిక్‌ కొట్టింది.. ఓటముల విషయంలో కాంగ్రెస్‌కు గోల్డ్‌ మెడల్‌ ఇవ్వొచ్చు అని ఎద్దేవా చేశారు.. కాంగ్రెస్‌ మునిగిపోవడమే కాకుండా.. వారి మిత్రులను కూడా ముంచేస్తోంది.. ఇండి కూటమి పార్టీలకు కూడా కాంగ్రెస్‌ నిజస్వరూపం ఏంటో తెలిసింది.. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గ్రహించారని పేర్కొన్నారు.. గతంలో కాంగ్రెస్‌ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటే.. ఇప్పుడున్న కాంగ్రెస్‌ అర్బన్‌ నక్సల్‌ భావజాలంతో పనిచేస్తుంది.. కొత్తగా గుడులకు వెళ్తున్నవారిని, పూజలు చేస్తున్నవారిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.. ఢిల్లీని వాయుకాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.. ఆప్‌ ప్రభుత్వంలో యమునా కాలుష్యకాసారంగా మారిపోయింది.. యమునాలో విషం కలిపారంటూ హర్యానా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారు. యమునాను ఆప్‌ ప్రభుత్వం అపవిత్రం చేసింది.. కాలుష్య కోరల నుంచి యమునా నదిని రక్షిస్తాం.. ఎంత కష్టమైనా యమునాను ప్రక్షాళన చేసి తీరుతాం అన్నారు.. అనినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే ఎంతో పోరాడారు.. అవినీతి పార్టీ ఓటమితో హజారే కూడా ఎంతో సంతోషిస్తున్నారు.. అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టినవారు అవినీతిలో కూరుకుపోయారు.. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాగ్‌ రిపోర్ట్‌ పెడతామని వెల్లడించారు ప్రధాని మోడీ..