NTV Telugu Site icon

Fire Accident Near YS Jagan Home: జగన్‌ నివాసం సమీపంలో వరుస అగ్ని ప్రమాదాలు.. ఘటనా స్థలానికి పోలీసులు

Fire Accident

Fire Accident

Fire Accident Near YS Jagan Home: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నివాసం సమీపంలో జరిగిన వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి…. అయితే, అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.. వైఎస్ జగన్ ప్రస్తుతం నివాసంతో పాటు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు.. రెండు రోజుల క్రితం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఓసారి.. రాత్రి ఎనిమిది గంటల సమయంలో మరోసారి జగన్‌ నివాసం ఎదురుగా ఉన్న గ్రీనరీలో మంటలు చెలరేగాయి.. గత ప్రభుత్వ హయాంలో సీఎం అధికారిక నివాసం కావటంతో ఆ రహదారిలో బారికేడ్లతో భద్రతతో పాటు గ్రీనర్ కోసం చెట్లను ఏర్పాటు చేశారు అప్పటి అధికారులు.. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రహదారిలో బారికేడ్లను తొలగించడంతో పాటు చెట్లకు కూడా నీరు పోయకుండా వదిలేయడంతో అవి పూర్తిగా ఎండి పోయాయి.. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. జగన్ నివాసం సమీపంలో జరిగిన ఘటన కలకలం రేపటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు.. ఘటన జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించారు.. అగ్నిప్రమాదానికి ఆకతాయిలు కావాలనే అక్కడ నిప్పు పెట్టడమే కారణమా..? లేక మరేదైనా కారణమా..? అనే కోణంలో విచారణ చేపట్టారు..

Read Also: Ratan Tata : సంచలనంగా రతన్ టాటా వీలునామా.. రూ.500కోట్లు పొందిన మిస్టరీ మ్యాన్ ఎవరు ?