Site icon NTV Telugu

CM Chandrababu: ప్రధాని మోడీ ఏపీ పర్యటన విజయవంతం.. మంత్రులు, అధికారులకు సీఎం అభినందనలు..

Modi In Ap

Modi In Ap

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత కర్నూలు శివారులో సూపర్‌ జీఎస్టీ – సూపర్‌ సేవింగ్స్‌ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

Read Also: Diwali: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ‘‘దీపావళి’’పై ఉద్రిక్తత..

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రావడం ఇది నాలుగోసారి.. ఈ పర్యటనలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. వీటిలో కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.. ఈ సభ మంచి మెసేజ్ ఇచ్చింది అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశారు.. ప్రధాని సైతం పర్యటనను ఎంతో ఆస్వాదించారని అభినందించారు. శ్రీశైలం మల్లన్న ఆలయం దర్శనంపై ప్రధాని మోడీ ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.. ప్రధాని మోడీ సైతం సూపర్ జీఎస్టీ కార్యక్రమాలను అభినందించారని తెలిపారు. అయితే, జీఎస్టీ నెల రోజుల పాటు చేసిన కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version