NTV Telugu Site icon

Tirupati Stampede Incident: తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టులో పిల్‌..

Tirupati Stampede

Tirupati Stampede

Tirupati Stampede Incident: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైకుంఠద్వారా దర్శనం టోకెన్ల జారీ దగ్గర జరిగిన తొక్కిసలాట తీవ్ర కలకలం రేపుతోంది.. టీటీడీ, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి విపక్షాలు.. అయితే, తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది.. సిట్టింగ్ లేదా మాజీ న్యాయమూర్తితో 30 రోజుల్లో విచారణ జరపాలని కోరారు పిటిషనర్‌.. ఇక, 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పిల్‌ దాఖలు చేశారు ప్రభాకర్ రెడ్డి.. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.. దీనిపై లంచ్ మోషన్ నిరాకరించిన న్యాయస్థానం.. వెకేషన్‌ బెంచ్‌లో విచారణ చేపడతామని చెప్పింది.. అయితే, ఈ నెల 17వ తేదీన ఈ పిల్‌పై వెకేషన్ బెంచ్ లో విచారణ జరిగే అవకాశం ఉంది..

Read Also: CM Revanth Reddy: జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు వస్తా.. కలెక్టర్ల సమావేశంలో సీఎం

Show comments