NTV Telugu Site icon

Pawan Kalyan: జనసేన ఆవిర్భావ దినోత్సవం.. 3 రోజుల పాటు పిఠాపురంలో ప్లీనరీ..

Janasena

Janasena

Pawan Kalyan: ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానంటూ 2014 మార్చి నెలలో జనసేన పార్టీని ప్రారంభించారు పవన్‌ కల్యాణ్.. పోటీ దూరంగా ఉండి.. మరొకరి విజయం కోసం పనిచేసినా.. పొత్తులు పెట్టుకుని విజయాలు అందుకున్నా.. ఓటములు చవిచూసినా.. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి విజయంలో కీలక భూమిక పోషించారు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. అయితే, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.. మూడు రోజుల పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ప్లీనరీ నిర్వహణపై పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో ఈ రోజు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంల నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు..

Read Also: Physical Harassment : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ.. రూంలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన డీఎస్పీ

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలి పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు.. మార్చి 12 నుంచి 14 తేదీల్లో ప్లీనరీని పిఠాపురంలో నిర్వహిస్తామని తెలిపారు నాదెండ్ల మనోహర్‌.. 2014 మార్చి 14న విశాల దృక్పథంతో, ప్రజాహితం కోసం పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించారు.. పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదరైనా బలంగా నిలిచారు.. ఈ రోజు కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైనది.. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించబోతున్నాంం.. పార్టీ సిద్ధాంతాలు, పవన్‌ కల్యాణ్‌ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరిస్తూ.. తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్ధేశించేలా ప్లీనరీ సాగాలి.. ఇందు కోసం పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామని.. ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలు నియమించుకోవాలి.. వారందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ అధినేత సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం అన్నారు..

Read Also: Bangladeshi Singer: కోల్‌కతా ఈవెంట్‌కి బంగ్లాదేశ్ సింగర్.. సీపీఎం ఆహ్వానంపై వివాదం..

మూడు రోజుల పాటు జరగనున్న ప్లీనరీ సమావేశాల గురించి వివరిస్తూ.. 12వ తేదీన ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం డెలిగేట్స్‌తో ఉంటుంది.. 14వ తేదీన బహిరంగ సభ ఉంటుందన్నారు నాదెండ్ల మనోహర్‌.. ఈ మూడు రోజులు వివిధ అంశాలపై చేపట్టే చర్చాగోష్టులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండేలా ఆలోచన చేస్తున్నాం అన్నారు.. ఇక, ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్‌, ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, లోకం మాధవి, అరవ శ్రీదర్‌, బొలిశెట్టి శ్రీవివాస్‌, ఎంఎస్ఎంఈ చైర్మన్‌ శివశంకర్‌, పార్టీ నేతలు మహేందర్‌రెడ్డి, శంకర్‌ గౌడ్, కోన తాతారావు, కల్యాణం శివ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది..

Show comments