Site icon NTV Telugu

Gadikota Srikanth Reddy: మీ రెడ్ బుక్ చూసి ఎవరూ భయపడటం లేదు..

Gadikota

Gadikota

Gadikota Srikanth Reddy: చంద్రబాబు పదహారేళ్ళ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ హయంలోనే ఫ్యాక్షన్ క్రియేట్ చేశారు.. రాయలసీమలో వైఎస్ఆర్ ఫ్యాక్షన్ అరికట్టేందుకు కొత్త నేతలను తీసుకు వచ్చారు.. మీ దుష్ట శక్తుల సాయంతో జగన్ ను ఓడించినంత మాత్రాన మీరు సాధించింది ఏమీ లేదు.. కడప నేతలు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.. కడప జిల్లా సహా రాష్ట్రానికి ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచన చేయాలి అన్నారు. వ్యవసాయం దండగ అని పుస్తకంలో రాసుకున్నది ఎవరు.. పోలవరాన్ని ఈ దశకు తెచ్చిందెవరు.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు నిలుపుకునే ఆలోచన చేయరు.. ఏపీలో జలయజ్ఞం కింద వైఎస్సార్ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో అందరికీ తెలుసు.. ఈ ఏడాదిలో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Jitesh Sharma: ఆర్మీ కాదని క్రికెటర్‌గా.. జితేష్ శర్మ బ్యాగ్రౌండ్ ఇదే!

ఇక, మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబే వైసీపీ వాళ్లకు పనులు చేయొద్దు టీడీపీ వాళ్ళకే పనులు చేయాలని పిలుపు ఇచ్చారు అని గడికొట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వైసీపీ వాళ్లను ఆఫీస్ కి రావొద్దంటారా.. వైసీపీ వాళ్లంటే ఏమనుకుంటారు.. ఇవాళ నరేంద్ర మోడీని పొగుడుతున్న చంద్రబాబు ఐదేళ్ల క్రితం ఆయనను ఎలా తిట్టారో అందరూ చూశారు.. అంత ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేయటానికి ఎందుకు భయపడ్డారు అని అడిగారు. ఎన్టీఆర్, చంద్రబాబును పొగిడినట్లు ఏఐ వీడియోలు తయారు చేయించి చూపిస్తున్నారు.. అదే ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు కూడా వేయాలి కదా అన్నారు. మీరు రాష్ట్రానికి ఏ ప్రాంతానికి మేలు చేశారు.. మీ పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకం గురించి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Niharika Konidela: మా సినిమాను గుర్తించినందుకు థాంక్స్!

ఇక, మాట్లాడితే నేను హైదరాబాద్ నిర్మించా అంటారు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వైసీపీ నేత గడికొట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి.. వైసీపీ కోవర్టులు టీడీపీలోకి వెళ్ళి హత్యలు చేస్తున్నారు అంటున్నారు.. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా.. ప్రజలకు మంచి చేయటం అంటే వైఎస్సార్, ఎన్టీఆర్ లాంటి నేతలు గుర్తుకు రావాలి.. కడపలో మహానాడు అనగానే జిల్లాకు ఉన్న పేరును కూడా మార్చిన చంద్రబాబు.. మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది.. మీరు కడపలో సక్సెస్ అవ్వాలంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే అవుతారు.. మీ హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేయటం తప్ప మీరు చేసేదేమీ లేదు.. జగన్ ప్రజానాయకుడు.. ఆయన ఎక్కడకు వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తారు.. ఫైనల్ గా కడప మహానాడు ఫెయిల్.. మీ రెడ్ బుక్ చూసి ఎవరూ భయపడటం లేదు అని గడికొట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version