NTV Telugu Site icon

New Land Registration Charges: ఏపీలో పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. నేటి నుంచే అమలు..

New Land Registration Charg

New Land Registration Charg

New Land Registration Charges: ఏపీలో ఇవాళ్టి నుంచి పెరిగిన భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు అమల్లోకి రానున్నాయి. జనవరి 31వరకే ప్రస్తుత ధరలు ఉండగా.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కనీసం 20 శాతం పెరుగనున్నాయి. దీంతో తక్కువ ధరలతో జరిగిన క్రయవిక్రయాలను రిజిస్టర్‌ చేసుకోవడానికి నిన్నటి వరకు క్లయింట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు. రెండు, మూడు రోజులుగా ఏపీలో ఏ రిజిస్ట్రార్ ఆఫీస్ చూసినా జనాలతో కిటకిటలాడాయి. బుధవారం అమావాస్య రావడంతో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు కాలేదు. ఎదురు అమావాస్య అని మంగళవారం కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లలేదు. దీంతో.. గురు, శుక్రవారాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.

Read Also: Congress MLC Candidate: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరు ఖరారు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలన్నీ రద్దీగా మారడంతో.. దాని ప్రభావం సర్వర్లపై పడింది. సాధారణం కంటే రిజిస్ట్రేషన్లు డబుల్ అవుతుండటంతో.. పలు ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కంప్యూటర్లు మొరాయించాయి. సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో సిబ్బంది రాత్రి వరకూ పని చేయాల్సి వచ్చింది. వచ్చిన డాక్యుమెంట్లన్నింటినీ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిన్న కూడా అర్ధరాత్రి దాటే వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది.