Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా, తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తెలిపారు. గత రెండున్నరేళ్లుగా ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు అందించిన ఆశీర్వాదంగా ఈ తీర్పును స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ఐక్యత, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.
ఇక రాజకీయాలకు కాదు.. ప్రజాసేవకే ప్రాధాన్యం
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక అందరి దృష్టి ప్రజాసేవపైనే ఉండాలని లోకేష్ సూచించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవలందించాలని స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు ముందున్న అసలైన బాధ్యత అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు మరింత వినయంతో, మరింత బాధ్యతతో పనిచేయాలనే సంకల్పాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అంకితభావంతో పనిచేస్తామని నారా లోకేష్ తెలిపారు. ప్రజాసేవ, రాష్ట్ర ప్రగతికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల విజయంతో మరింత బాధ్యత పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ప్రజాప్రతినిధి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు మంత్రి నారా లోకేష్..
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>The municipal verdict is a mandate to serve, not to celebrate. We accept it with humility as the people’s blessing for the good governance of the last two and a half years. Congratulations to all the victorious TDP, JanaSena and BJP candidates, and thank you to our three parties’ leaders and workers for their collective effort.
Now that the municipal elections are over, our only focus is service, for every citizen, beyond party lines. There is no room for arrogance. Keeping the trust people have placed in us is our real responsibility, and we will work harder than ever to deliver on their aspirations.
@BJP4Andhra @JanaSenaParty
@JaiTDP
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam</p>— Lokesh Nara (@naralokesh) <a href=”https://x.com/naralokesh/status/2117618737713164612?ref_src=twsrc%5Etfw”>November 3, 2026</a></blockquote>
<script async src=”https://platform.x.com/widgets.js” charset=”utf-8″></script>

