Site icon NTV Telugu

Nara Bhuvaneshwari: లండన్‌లో 2 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari: లండన్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్‌లోని మేఫెయిర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) మరియు ఐవోడీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో భువనేశ్వరికి ఈ గౌరవాలు లభించాయి.

Read Also: Plane Crashe: అమెరికాలో కూలిన కార్గో విమానం.. ముగ్గురు మృతి

ప్రజా సేవా రంగం, సామాజిక ప్రభావం, నాయకత్వం అంశాల్లో విశిష్టమైన సేవలందించినందుకు గాను నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఐవోడీ సంస్థ ప్రదానం చేసింది. అలాగే, కార్పొరేట్ పరిపాలనలో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ లభించింది. ఈ అవార్డును కూడా నారా భువనేశ్వరి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో నిలుస్తున్న తీరు పట్ల గర్వం వ్యక్తం చేశారు. ఇక లండన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలాగే విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు.

Exit mobile version