MLC Nagababu Slams YSRCP: వైసీపీపై ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ హిందూ ద్రోహి.. అంటూ సంచలన వీడియో విడుదల చేసిన నాగబాబు, వైసీపీ హయాంలో జరిగిన అంతర్వేది రథం దగ్ధం ఘటన, రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటన, తిరుమల డిక్లరేషన్ అంశాలపై మండిపడ్డారు. వైసీపీ నాయకులకు హిందువులపై కుళ్లు కుతంత్రాలు తప్ప మరొకటి లేదని విమర్శించారు. తాను గర్వంగా సనాతన హిందువునని పేర్కొన్న నాగబాబు.. ఇతర మతాలను కించపరచకుండా ధర్మం కోసం నిలబడుతున్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా తొలి రోజే అసెంబ్లీలో అర్చకుల తక్కువ జీతాల సమస్యపై మాట్లాడానని గుర్తు చేశారు. వైసీపీ నాయకులకు మసిపూసి మాయ చేయడం అలవాటేనని, అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
Read Also: Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలవుతున్న ‘దూత’ వేట!
వైసీపీ నేతలకు ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న ఆసక్తి, హిందూ దేవాలయాలపై లేదని మండిపడ్డారు నాగబాబు.. రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికిన ఘటనను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. సినిమా రివ్యూలపై చూపించే శ్రద్ధ, భగవంతుడిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రామ మందిర ప్రారంభోత్సవం సమయంలో ఒక్క ట్వీట్ కూడా చేయలేదని గుర్తు చేశారు. తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి, సామాన్య భక్తులను వెంకటేశ్వరస్వామికి దూరం చేశారని ఆరోపించారు. ఏ మాఫియాను కాపాడడానికి వైఎస్ జగన్ ఇదంతా చేశావు? అంటూ ప్రశ్నించారు. స్వామివారి దర్శనాలను కూరగాయల బేరంలా మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డిని తీవ్రంగా విమర్శించారు. హిందువులను వైసీపీ చులకనగా చూస్తుందా? అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ అడిగితే అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. అబ్దుల్ కలాం కంటే నువ్వు గొప్పవాడివా జగన్? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల కొండతో పాటు ఇతర కొండలను గుండు కొట్టాలని చూసింది నువ్వే కాదా జగన్? అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హిందూ ద్రోహి వైసీపీ #NoGheeInTTDLaddu@JanaSenaParty pic.twitter.com/m6qMO3q60v
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 4, 2026