MLA Quota MLC elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది.. పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో టీడీపీ మూడు, జనసేన, బీజేపీ చెరో ఒకటి ఎమ్మెల్సీ స్థానాలు తీసుకుంటున్నాయి.. ఐదు స్థానాలు అధికార కూటమికి రావడంతో వైసీపీ నుంచి పోటీ లేదు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రోత్సహించడంలో భాగంగా అభ్యర్థులు ఎంపిక జరిగింది.. ఈసారి ఎమ్మెల్సీ స్థానాలకు చాలామంది ఆశావహులు ఉన్నారు.. ఇంచుమించుగా పాతిక నుంచి 30 మంది వరకు పోటీలో ఉన్నారు.. కానీ, ముగ్గురికిమాత్రమే అవకాశం ఉంది.. తమకు వస్తుందని ఆశించి రానివారంతా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పిఠాపురం వర్మ ఈసారి. ఖాయంగా ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నారు. కానీ, రాలేకపోయేటప్పుటికీ అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా దేవినేనిఉమా, బుద్ద వెంకన్న, జవహర్, పీతల సుజాత, మోపిదేవి వెంకటరమణ ఇలా చాలా మంది ఆశించారు.. కానీ, ఎవరికీ అవకాశం రాలేదు..
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అందరికీ ఫోన్ చేసి ఏ కారణం వల్ల ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నారు అనేది వివరించారు. వచ్చే కోటాలో 20కి పైగా ఖాళీలు ఉంటాయని అప్పుడు తప్పనిసరిగా అవకాశం ఉంటుందని చెప్పారు.. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ మాట చెప్పమన్నారు అని కూడా వివరించారు. అయినప్పటికీ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఖాళీలు తక్కువగా ఉండటంతో తప్పని పరిస్థితి ఏర్పడింది..
Read Also: Champions Trophy: భారత్ గ్రాండ్ విక్టరీ.. అనుష్కకు కోహ్లీ విన్నింగ్ హగ్..
అయితే, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి యువ మహిళ కావలి గ్రీష్మకు అవకాశం దక్కింది. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా పోరాటాలు చేశారు అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. టికెట్ రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. బీద రవిచంద్ర కూడా ఇదే పరిస్థితి పార్టీకి అంటిపెట్టుకొని ఉండి టికెట్ విషయంలో కొంత ఇబ్బందులు ఎదురైనా సర్దుకుని పోయారు.. సర్దుకుని వెళ్లారు దీంతో ఎమ్మెల్సీ స్థానం ఆశించారు. ఆశించినట్టుగానే చంద్రబాబు న్యాయం చేశారు. బీటీ నాయుడు కూడా రెన్యువల్ కావాలని అడిగారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఉండి కుటుంబ సభ్యులకు.. పార్టీ నేతలకు ఎంతో నైతిక ధైర్యం ఇచ్చారు. అందుకే చంద్రబాబు తిరిగి రెన్యువల్ చేసినట్టు సమాచారం.. మొత్తానికి ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ అది కూడా మహిళకి చంద్రబాబు అవకాశం ఇచ్చారు ఈ ముగ్గురు ఈరోజు నామినేషన్ అయినా వేయనున్నారు..