NTV Telugu Site icon

Vangalapudi Anitha Vs Botsa: బుడమేరు బాధితులకు వరద సాయంపై మండలిలో రచ్చ.. మంత్రి అనిత వర్సెస్ బొత్స..

Anitha Vs Botsa

Anitha Vs Botsa

Vangalapudi Anitha Vs Botsa: శాసన సభ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. శాసన మండలిలో మాత్రం వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీంతో.. వైసీపీ వర్సెస్‌ కూటమి సర్కార్‌గా శాసన మండలి మారుతోంది.. ఈ రోజు శాసనమండలిలో బుడమేరు బాధితులకు వరద సాయంపై మంత్రి వంగలపూడి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.. మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం.. నేనే అందుకు బాధ్యత తీసుకున్నాను అన్నారు. కానీ, ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైంది. ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదు. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని వెల్లడించారు బొత్స..

Read Also: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి మళ్లీ షాక్‌.. రిమాండ్‌ అప్పటి వరకు పొడిగింపు..

ఇక, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ.. బుడమేరు వరద దురదృష్టకరం అన్నారు.. ఆక్రమణల కారణంగా బుడమేరు వరదలు వచ్చాయన్న ఆమె.. 2005 లో భారీ వరదలు విజయవాడను ముంచెత్తాయి. బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్ధ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి.. 20 శాతం నేటికీ పూర్తవ్వలేదు.. గత ప్రభుత్వం వదిలేయడం వల్లే మొన్నటి వరదల్లో విజయవాడ మునిగిపోయిందని ఆరోపించారు.. సీఎం 11 రోజులు బస్సులోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నారు.. అగ్గిపెట్టెలు.. కొవ్వొత్తులు అందించాలనే ఆలోచన రావడం సంతోషం. విజయవాడ వరద బాధితులను అన్నిరకాలుగా ఆదుకున్నాం. ఇంట్లో వస్తువులకు డబ్బులిచ్చాం. వాహనాలకు డబ్బులిచ్చాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు విడుదల చేశాం. వరద బాధితుల్లో ఎక్కడా అసంతృప్తి లేదన్నారు..

Read Also: Eblu Feo X: 5 సంవత్సరాల వారంటీతో బడ్జె‌ట్ ధరలో ఫ్యామిలీ EV స్కూటర్!

ఈ రోజుకీ ఎవరైనా అర్హులైన బాధితులుంటే వారికి సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు మంత్రి అనిత.. అయితే, వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వరద బాధితులకు కోటి రూపాయలు ప్రకటించారు. ఆ డబ్బులు మా విపత్తుల శాఖకు ఇంతవరకూ అందలేదన్నారు.. వైసీపీకి చెందిన ఓ పత్రిక ఎలాఉందో… సభలో వైసీపీ సభ్యులు అలానే ఉన్నారని ఎద్దేవా చేశారు.. ఎంతమందికి సాయం అందిందో ఆర్టీఐ యాక్ట్ లో పెడితే తెలుస్తుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులకు సూచించారు హోం మంత్రి వంగలపూడి అనిత.. అయితే, బుడమేరు వరదలపై చర్చ సందర్భంగా.. శాసన మండలిలో బొత్స వర్సెస్‌ మంత్రి అనితగా మారిపోయింది పరిస్థితి..