NTV Telugu Site icon

AP Debts: ఏపీ అప్పులపై మండలిలో రచ్చ..

Payyavula Keshav

Payyavula Keshav

AP Debts: గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది అనే అంశంపై శాసన మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. వాస్తవాలు చెబితే మాకు అభ్యంతరం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, చట్ట సభల పరిధిలోకి రాకుండా నిధులు ఖర్చుపెడితే ఎలా ఒప్పుకుంటాం అని నిలదీశారు మంత్రి పయ్యావుల కేశవ్.. నిధులను పక్కదారి పట్టించడం రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొన్నారు.. అయితే, గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని అని ప్రశ్నించారు టీడీపీ సభ్యులు.. ఇక, గత ప్రభుత్వం 9,74,000 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని వ్యాఖ్యానించారు మంత్రి పయ్యావుల.. రాజ్యాంగ విరుద్ధంగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు చేశారని దుయ్యబట్టారు.. అయితే, ఈ విషయంపై గవర్నర్, కేంద్ర మంత్రికి అప్పుడే ఫిర్యాదు చేశామన్నారు.. శాసన సభ, మండలి పర్యవేక్షణలో రాకుండా నిధులు సేకరించారని ఆరోపించారు.. చట్ట సభలకు తెలియకుండానే ఖర్చు చేశారంటూ ఫైర్ అయ్యారు.. దీంతో.. సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.. మంత్రి పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యలపై మండిపడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్‌యులు.. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.. దీంతో.. శాసనమండలి కాసేపు రచ్చరచ్చగా మారంది..