NTV Telugu Site icon

Minister Nimmala Ramanaidu: మరోసారి పోలవరం పర్యటనకు సీఎం.. ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్‌ ప్రకటన..!

Nimmala

Nimmala

Minister Nimmala Ramanaidu: పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించి.. ఇప్పటి వరకు జరిగిన పనులపై సమీక్షించారు సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, మరోసారి పోలవరం పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం.. అంతేకాదు.. ఈ పర్యటనలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పునర్‌నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.. ఇరిగేషన్ శాఖలో పలు ప్రాజెక్టులపై, ప్రధానంగా పోలవరంపై సీఎం రివ్యూ నిర్వహించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పోలవరాన్ని యజ్ఞం లాగా పునర్నిర్మాణం చేయాలని చర్చించాం.. ఈ నెల 2వ వారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఉంటుంది.. ఈ పర్యటనలోనే పోలవరం నిర్మాణం షెడ్యూల్ ను సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు..

Read Also: Fastest Centuries In T20: టి20లలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్స్ వీరే

ఈసీఆర్ఎఫ్ ఎలా పూర్తి చేస్తాం..? ఎప్పుడు పూర్తి చేస్తాం..? అనే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు తెలిపారు మంత్రి నిమ్మల.. షెడ్యూల్ ప్రకటన తేదీ నుంచి అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.. గత పాలనలో డయాఫ్రం వాల్ పూర్తిగా విధ్వంసం అయింది.. మెయిన్ డ్యాం ప్రాంతంలో భారీ గుంతలు పడ్డాయి.. భౌగోళికంగా పోలవరం ప్రాజెక్టుకు ఉపయోగపడేవి అన్నీ పాడైపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, 2025లో పోలవరం పనులు పూర్తిస్ధాయిలో జరుగుతాయి.. టెక్నికల్ అనుమతులు కూడా సూత్రప్రాయంగా వచ్చాయి.. డయాఫ్రం వాల్ కు సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణానికి సూత్రప్రాయంగా ఇంజనీర్లు అంగీకరించారు.. చంద్రబాబు ప్రకటించిన దగ్గర నుంచి సమయం వృధా చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు.. డిసెంబర్‌లోనే పోలవరం గ్రౌండ్ వర్కులు పూర్తి చేస్తాం.. పోలవరం ఆర్ & ఆర్, భూసేకరణ పరిస్ధితులను అధిగమిస్తాం.. వెంటనే ఆర్ & ఆర్ లో కాలనీల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తాం అని వెల్లడించారు..

Read Also: Shivam Dube – SKY: శివాలెత్తిన సూర్య-శివమ్ దూబే జోడి

ఇక, పాత ఏజెన్సీల బిల్స్ పూర్తి చేస్తాం.. అలాగే జీవో 35 ద్వారా అదే ఏజెన్సీలను కొనసాగిస్తాం అన్నారు మంత్రి నిమ్మల.. నిర్వాసితులకు తోడుగా అండగా ఉంటాం.. పెండింగ్ బిల్లులు 996 కోట్లు వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభిస్తాం అన్నారు.. పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలు పూర్తిస్ధాయిలో పరిష్కరించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.. హంద్రీ-నీవా కాలువ పెంపుదల, పనులు ప్రారంభించాలని సీఎం చెప్పారు.. చింతలపూడి ఎత్తిపోతల కూడా 30 లక్షల మందికి తాగునీరు అందించే ప్రాజెక్టు.. 2019లో చింతలపూడి పైన కేసులు వేశారు.. సుప్రీంకోర్టు ఆదేశించినా మూడు నెలల్లో ఈసీ అనుమతులు తీసుకోకుండా చింతలపూడి ఎత్తిపోతలను ప్రశ్నార్ధకంగా మార్చేశారని మండిపడ్డారు.. ఈసీ క్లియరెన్స్ త్వరగా వచ్చేలా చేయాలని మాకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.. వెలిగొండ ఫలాలు అందాలంటే ఇంకా రెండేళ్లు పడుతుందన్నారు.. 2026 జూన్ కల్లా నీరు వచ్చేలా ప్రణాళికలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు..

Show comments