NTV Telugu Site icon

TDR Bonds Scam: టీడీఆర్ బాండ్లలో అవినీతి.. రూ.700 కోట్ల స్కామ్..!

Narayana

Narayana

TDR Bonds Scam: టీడీఆర్ బాండ్ల స్కాం కింద రూ. 700 కోట్ల మేర అవినీతి జరిగిందన్నారు మంత్రి నారాయణ.. టౌన్ ప్లానింగ్ జేడీలు, ఏడీలతో సమావేశమైన ఆయన.. టౌన్ ప్లానింగ్ అధికారుల పని తీరుపై సమీక్ష నిర్వహించారు.. టౌన్ ప్లానింగ్ వింగ్ లో ఉన్న సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి.. సిబ్బంది కొరత, ప్రమోషన్లపై చర్చ సాగింది.. ఇక, లే ఔట్లకు అనుమతులపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.. అయితే, సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. టీడీఆర్ బాండ్లపై సరైన సమాచారం ఇవ్వలేదంటూ మండిపడ్డారు.. ప్రభుత్వ పనితీరు చూపించే శాఖలో పురపాలక శాఖ ప్రధానమైందన్న నారాయణ. అధికారులను సస్పెండ్ చేయటం, డిస్మిస్ చేయడం పెద్ద విషయమేం కాదన్నారు.. అయితే, అక్రమాలు జరగకుండా కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Read Also: Anoosha Krishna: తండ్రి వయసున్న నిర్మాత ఎంగేజ్మెంటయినా పర్లేదన్నాడు.. హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

టౌన్ ప్లానింగ్ విషయంలో 2014-19 మధ్య కాలంలో ఒక్క కంప్లైంట్ రాలేదు.. కానీ, గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు మంత్రి నారాయణ.. తణుకు, తిరుపతి, గుంటూరు, విశాఖ వంటి నగరాల్లో టీడీఆర్ బాండ్లల్లో స్కాం జరిగింది. తణుకులో 29 బాండ్లు ఇచ్చారు.. ఇవన్నీ అవకతవకలే. గజాల కింద లెక్కలు వేయాల్సి ఉండగా.. ఎకరాల లెక్కలేసి బాండ్లల్లో అవకతవకలు జరిగాయి. 1:200 ఇవ్వాల్సింది 1:400 ఇచ్చారని మండిపడ్డారు.. విలువలూ పెంచేశారు.. ఇదో పెద్ద స్కాం. ముగ్గుర్ని సస్పెండ్ కూడా చేశారు. టీడీఆర్ బాండ్ల విషయంలో నివేదిక వచ్చింది. టీడీఆర్ బాండ్ల విషయంలో అవినీతి ఇలా కూడా చేస్తారా..? అని ఆశ్చర్యం కలిగే రీతిలో స్కాం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Robbery Vegetable Vendor: దారుణం.. కూరగాయలు అమ్మే వ్యక్తిని దోచుకున్న వ్యక్తులు..(వీడియో)

వందల కోట్ల అవినీతి టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. గుంటూరులోనూ ఇదే తరహాలో వాల్యూయేషనులోనే వేరియేషన్ చూపారన్నారు నారాయణ.. 9000 గజాలు అయితే 20 వేల గజాలకు లెక్కలేసి టీడీఆర్ బాండ్లకు లెక్కలేశారు. ఈ స్కాం విషయంలో సీఎం చంద్రబాబుతో సంప్రదిస్తానని వెల్లడించారు. నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి పనులూ చేయొద్దని అధికారులకు స్పష్టంగా చెప్పాను. ఏ స్థాయి నాయకుడైనా సరే నిబంధనలకు విరుద్దంగా చేయమంటే చేయొద్దనే చెప్పాం అన్నారు మంత్రి నారాయణ.