Minister Narayana: రాజధాని అభివృద్ధి కోసం 62,000 కోట్ల ప్రాజెక్టు చూపట్టాం.. అందులో రాష్ట్ర కేబినెట్ రూ.45 వేల కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఇక, 2014-19లో మున్సిపల్ శాఖ పనితీరు అద్భుతం అని అభివర్ణించిన ఆయన.. ప్రస్తుతం ఖాజానా ఖాళీగా ఉందని విమర్శించారు.. ప్రస్తుతం కాంట్రాక్టర్‌లు వర్క్స్ చేయడానికి కూడా ముందుకు రావడం లేదన్నారు.. అయితే, ఏప్రిల్ మొదటి వారం నుండి అభివృద్ధి నిధులు మున్సిపాలిటీలకే కేటాయిస్తామని ప్రకటించారు.. రాష్ట్రంలో ఉన్న 163 మున్సిపాలిటీలకు రోజుకు 135 లీటర్స్ మంచినీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. వీలైంత త్వరగా డీపీఆర్, టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది మెప్మా సభ్యులు ఉన్నారు.
Read Also: Kia Syros EV: కియా సిరోస్ నుంచి ఎలక్ట్రిక్ వెర్షన్.. గొప్ప ఫీచర్లతో 2026లో లాంచ్..!
ఇక, టౌన్ ప్లానింగ్ విభాగం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు మంత్రి నారాయణ.. ఐదు అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్న ఆయన.. ఆన్‌లైన్‌లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు.. లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు.. మరోవైపు, విశాఖ పట్టణంలో 1200 టన్నుల వ్యర్ధాలతో నూతన ప్లాంట్ ఏర్పాటు చేసి విజయం సాధించాం. టిడ్కో గృహ నిర్మాణంలో ఆధునిక టెక్నాలాజీ వినియోగించి గృహ నిర్మాణాలు చేపట్టాం. దేశంలోని పలు రాష్ట్రాలు మన నిర్మాణ శాంకేతికతను అమలు చేస్తున్నాయి. అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనులు పూర్తి చేయాలి. ముఖ్యంగా తాగునీరు, మురు గునీరు పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలని సూచించారు.. అయితే, గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి నారాయణ..