NTV Telugu Site icon

AP Assembly: టిడ్కో ఇళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. అసెంబ్లీ సోమవారానికి వాయిదా

Minister Narayana

Minister Narayana

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.. అయితే, టిడ్కో ఇళ్ల అంశంపై సభలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. టిడ్కో ఇళ్ల లోన్లు ఒక నెల వాయిదా వేయాలని బ్యాంకులకు లేఖ రాశామని తెలిపారు.. హడ్కో నుంచీ రుణం ప్రభుత్వమే తీసుకుని టిడ్కో రుణాలు తీరుస్తాం అని వెల్లడించారు. లబ్ధిదారులను మార్చేయడం, డీడీలు కట్టించుకుని బ్యాంకులో వేయలేదు అన్నదానిపై దర్యాప్తు జరిపిస్తారని స్పష్టం చేశారు.. పూర్తయిన ఇళ్లకు ముందుగా సౌకర్యాలు ఇస్తాం అన్నారు.. 2018-19 లో నిర్ణయించిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్లు కేటాయిస్తాం అని వెల్లడించారు మంత్రి నారాయణ.

Read Also: Nabha Natesh : చక్కగా చీరకట్టి చిక్కటి అందాలను చూపిస్తోన్న నభా నటేశ్

ఇక, అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. 2024-25 సంవత్సరానికి ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కేటాయంపుపై అసెంబ్లీలో నోట్ ఆన్ డిమాండ్స్ ప్రవేశపెట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు.. భారీ, మధ్య తరహా ప్రాజెక్ట్ లకు 15,513 కోట్ల రూపాయలు కేటాయింపు కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు నిమ్మల.. అలాగే చిన్న నీటి తరహా ప్రాజెక్టులకు 1,227 కోట్ల రూపాయల నిధులు కేటాయంపు కోరుతూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు.. ఇక, టిడ్కో ఇళ్ళ నిర్మాణాలపై శాసన సభలో చర్చ కొనసాగుతోంది.. మరోవైపు.. జలవనరులు శాఖ మంత్రి రామానాయుడుతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భేటీ అయ్యారు.. రాయచోటి నియోజకవర్గ నీటి సమస్యలపై చర్చించారు.. శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వాయర్ బ్యాలెన్స్ పనులు పూర్తికి 156 కోట్లు మంజూరు చేయాలని కోరారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. కాగా, ఈ రోజు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.. ఏపీ శాసనసభ మాజీ సభ్యులు కెంబూరి రామ్మోహనరావు, పాలపర్తి డేవిడ్ రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, అడుసుమిల్లి జయప్రకాష్, శ్రీమతి మాగుంట పార్వతమ్మ మరియు శ్రీ రెడ్డి సత్యనారాయణ మరియు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాప తీర్మానం పెట్టారు.. మృతులకు సంతాపంగా రెండు నిముషాల మౌనం పాటించింది శాసన సభ..

Show comments