Site icon NTV Telugu

Minister Nara Lokesh: ఏయూలో విద్యార్థి మృతిపై స్పందించిన మంత్రి న లోకేష్.

Lokesh

Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి మృతి చెందడంతో.. ఉద్రిక్తత నెలకొంది.. నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.. వీసీ రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.. అయితే, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి మృతిపై స్పందించారు మంత్రి నారా లోకేష్.. వర్సిటీలో రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.. నిన్న ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్ధి ఫిట్స్ వచ్చి చనిపోయారని తెలిపారు.. అయితే, అంబులెన్స్ లో తీసుకెళ్లినా కాపాడలేకపోయాం అన్నారు.. కానీ, కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాస్ లు జరగకుండా అడ్డుకోవడం సరికాదని హితవు చెప్పారు.. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. ఆంధ్రా యూనివర్సిటీని టాప్ 100 లో ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు లోకేష్. ప్రభుత్వం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉందని.. అంతేకానీ వైస్ ఛాన్సలర్ లను ఇబ్బంది పెట్టడం, ఆటంకాలు సృష్టించడం సరికాదన్నారు. అలా కాకుండా రాజకీయం చేస్తామంటే కఠిన చర్యలకు వెనకడబోమాని హెచ్చరించారు.. కొన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ వేస్తాం. 100 రోజుల్లోపు రిపోర్ట్ తెప్పించి యాక్షన్ తీసుకుంటామని ప్రకటంచారు మంత్రి నారా లోకేష్‌..

Read Also: Students Protest: ఆంధ్రా యూనివర్సిటీలో టెన్షన్.. టెన్షన్‌..

కాగా, BED సెకండ్ ఇయర్ విద్యార్థి మణికంఠ మృతి పట్ల విద్యార్థుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.. నిన్న రాత్రి వీసీ ఛాంబర్ లోకి చొచ్చుకొని పోయి రచ్చ రచ్చ చేశారు.. ఈ రోజు యూనివర్సిటీ బంద్‌కు విద్యార్థి సంఘ నాయకులు పిలుపునిచ్చారు. అందులో ఈ రోజు పరీక్షలు, క్లాస్‌లో బహిష్కరించింది ఆందోళనకు దిగారు.. అయితే, విజయనగరానికి చెందిన వింజమూరి వెంకట సాయి మణికంఠ అనే 25 ఏళ్ల విద్యార్థి.. యూనివర్సిటీలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతూ క్యాంప్‌లోని శాతవాహన హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం ఉదయం వాష్‌రూమ్‌లో జారిపడ్డాడు.. విద్యార్థులు వెంటనే వర్సిటీ ఆవరణలో ఉన్న డిస్పెన్సరీకి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ను రప్పించినా ప్రాణాలు కాపాడలేకపోయారు.. తనకు ఊపిరి అందడం లేదని, ఆక్సిజన్‌ పెట్టాలని మణికంఠ కోరాడు.. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. కానీ, అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు అప్పటి నుంచి ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు..

Exit mobile version