Minister Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న తెలువారి తరలింపుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్లలో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్‌తో పాటు సుప్రీం కోర్టు న్యాయవాది శ్రీ నిరూప్ రెడ్డి ఉన్నారు. కుటుంబం సభ్యులు, బంధుమిత్రులు కలిపి 30 మంది ఇటీవల పశుపతినాథ్ ఆలయానికి వెళ్లారు. ప్రస్తుతం తాము ఖాట్మండ్‌లోని ఓ హోటల్లో సురక్షితంగా ఉన్నామని, తమ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే, నేపాల్ నుంచి బీహార్ బోర్డర్ కు 22 మంది తెలుగువారిని తరలించారు.. రేపు ఖాట్మాండ్ నుంచి బయలుదేరనుంది ప్రత్యేక విమానం.. ఏపీ భవన్ అధికారులతో మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. రేపు రాత్రికి ఏపీకి నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు వచ్చే అవకాశం ఉంది.. సొంత జిల్లాలకు తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం..
Read Also: CPL 2025 Robbery: తుపాకీతో బెదిరించి.. ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు!
ఇక, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేపాల్ పరిస్థితి పై చర్చించాం.. నేపాల్ లో తెలుగు వారి పరిస్థితి… ఏపీకి తీసుకు వచ్చే అంశం పై చర్చించాం అన్నారు మంత్రి నారా లోకేష్.. అనంతపురం సభ నుంచి హుటాహుటిన మంత్రులు అనిత, దుర్గేష్ వచ్చారని తెలిపారు లోకేష్.. ఏపీ భవన్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం.. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ లో టీడీపీ ఎంపీ సానా సతీష్ అధికారులతో సమీక్ష జరిపారు. 212 మంది ఆంధ్రులు నేపాల్ లో 12 లొకేషన్ లలో ఉన్నారు. ఖాట్మండ్ లో ఎక్కువ మంది ఉన్నారు. టైం టు టైం మానటిరంగ్ జరుగుతోంది. ఖాట్మాండ్ నుంచి ప్రత్యేక విమానంలో రేపు ఆంధ్రుల ను నేపాల్ నుంచి తీసుకు వస్తాం.. ఆ ఫ్లైట్ శ్రీకాకుళం.. కడప లో ల్యాండ్ అవుతుందన్నారు.. ఇక, నేపాల్ బోర్డర్ లో తెలుగు వారు ముందు లక్నో చేరుకుంటారు.. లక్నో నుంచి ఏపీకి వస్తారు.. రేపు ఉదయం 10 గంటలకు ఆర్టిజిఎస్ లో మళ్ళీ సమావేశం అవుతాం. ప్రతి ఒక్కరిని వారి ఇంట్లో దింపే బాధ్యత తీసుకుంటాం.. మంత్రులు.. అధికారులు కలిసి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నాం. రేపు రాత్రి కి ప్రతి ఒక్కరు చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం అన్నారు మంత్రి నారా లోకేష్..
