NTV Telugu Site icon

AP Legislative Council: మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి లోకేష్..

Lokesh

Lokesh

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాసనసభలో ప్రతిపక్ష నేత లేని నేపథ్యంలో లోకాయుక్త మెంబర్స్ సెలెక్షన్ కమిటీ కాంపోజిషన్స్ గురించి ఏపీ లోకాయుక్త అమెండ్‌మెంట్ బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి ఛైర్మన్‌, శాసనసభ స్పీకర్, హోంమంత్రి గాని లేదా ఏదైనా శాఖ మంత్రి, ప్రతిపక్ష నేత, కౌన్సిల్ ఛైర్మన్ సభ్యులుగా ఉండేవారని మంత్రి తెలిపారు.

Read Also: AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..

శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో మిగిలిన నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ ఉంటుందని లోకేష్ అన్నారు. ఛైర్మన్ నియామకానికి సంబంధించి ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది.. సాధారణంగా లోకాయుక్తకు రిటైర్డ్ సీజే గాని, హైకోర్టు రిటైర్డ్ జడ్జి గాని ఛైర్మన్ గా ఉంటారు.. ఉప లోకాయుక్తకు డిస్ట్రిక్ట్ రిటైర్డ్ జడ్జి ఛైర్మన్‌గా ఉంటారని మంత్రి లోకేష్ చెప్పారు. సవరణ బిల్లులో ప్రతిపక్ష నేత లేని సమయంలో అని మాత్రమే ఉంది.. తాము తీసివేయలేదని.. మనం అందరం ప్రజాస్వామ్యంలో భాగస్వాములేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఎవరు ఛైర్మన్, సభ్యులు అనేది.. స్పీకర్, మండలి ఛైర్మన్ నిర్ణయిస్తారన్నారు. ఓటింగ్‌కు వైసీపీ గైర్హాజరైంది.. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాని పరిస్థితి అని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.

Read Also: CM Chandrababu: వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించాం..