Site icon NTV Telugu

Nara Lokesh: పొదిలిలో వైసీపీ శ్రేణుల దాడి.. జగన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్

Lokesh

Lokesh

Nara Lokesh: ప్రకాశం జిల్లా పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు.. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారు అని పేర్కొన్నారు.

Read Also: MP Balram Naik: కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలే.. ఎంపీ ఘాటు వ్యాఖ్యలు..!

అయినా, సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేశారు అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారు.. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశేనని ఎద్దేవా చేశారు. మహిళలపై వైసీపీ నేతలు ఒళ్లు బలిసి మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Exit mobile version