NTV Telugu Site icon

Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం.. షరతులు ఇవే..!

Nadendla Manohar

Nadendla Manohar

Free Gas Cylinders: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూపర్‌ సిక్క్‌లో భాగంగా మరో హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.. ఈ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయబోతున్నారు.. ఈ పథకంలో అమలులో అర్హతలు.. దరఖాస్తు.. మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేయగా.. ఈ రోజు మరింత క్లారిటీ ఇచ్చారు మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్.. సూపర్ సిక్స్ లో ప్రధానమైనది ౩ ఉచిత సిలిండర్ల పథకాన్ని ఈ నెల 31న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తాం అన్నారు.. 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లకు లాభం కలిగిందుకు ఈ ఆలోచన చేశాం.. అక్టోబర్ 31న మొదటి డెలివరీ రోజు.. ఖాళీ సిలిండర్, LPG కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని.. ఈనెల 29 నుంచీ బుకింగ్స్‌ చేసుకోవచ్చు అని వివరించారు.

Read Also: Trivikram : రాజమౌళిని మించిపోయే విధంగా తన నెక్ట్స్ సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

ఇక, ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఒక మెసేజ్ వెళ్తుంది.. పట్టణాలలో 24 గంటలలోపు, గ్రామాలలో 48 గంటలలోపు సిలిండర్ డెలివరీ అవుతుందని.. సిలిండర్ డెలివరీ చేసిన‌ 48 గంటలలోపు సొమ్ము లబ్ధిదారుల ఖాతాలకు వస్తుందన్నారు మంత్రి మనోహర్‌.. 29న ఆయిల్ కంపెనీలకి మొదటి చెక్ ఇస్తున్నాం.. ఈ పథనానికి రూ.2,674 కోట్లు ప్రాథమికంగా ప్రభుత్వానికి ఖర్చు అవుతుందన్నారు.. డెలివరీ, బుకింగ్ సమస్యలకు 1967 కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందన్న ఆయన.. మొత్తం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తాం అని స్పష్టం చేశారు.. లబ్ధిదారుల సంఖ్య పెంచడానికే మేం ప్రయత్నం చేస్తున్నాం.. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి అందించే విధంగా పని చేస్తున్నాం అన్నారు.. 1.47 కోట్ల రేషన్ కార్డులు మా రికార్డులు ఉంటాయి.. ప్రధానమంత్రి ఉజ్వల నుంచీ వచ్చేది 9.8 లక్షలే.. 3 నుంచీ 5 సిలిండర్లు ప్రతీ ఇంట్లో సంవత్సరానికి వినియోగం ఉంటుందని తెలిసిందన్నారు.

Read Also: IND vs NZ 2nd Test: పీకల్లోతు కష్టాల్లో భారత్.. ఇక ఆశలు ఆ ఇద్దరిపైనే! లంచ్‌ బ్రేక్‌కు స్కోర్ ఎంతంటే?

ఇక, రైతుల నుంచి 147 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. 34 లక్షలు ఇప్పటికే చెల్లించాం అన్నారు మంత్రి మనోహర్‌.. ధరల స్ధిరీకరణ కమిటీ వేసి.. కందిపప్పు 67 రూపాయలకే అందిస్తున్నాం.. పామాయిల్ ను 110 కే 2300 ఔట్ లెట్ ల ద్వారా అందిస్తున్నాం అని వివరించారు.. క్వాలిటీ విషయంలో ఎట్టిపరిస్ధితిలో వెనుకంజ వేయబోమన్నారు.. పీడీఎస్ రైస్ అనేది ఒక మాఫియాలా తయారైంది.. ఎన్ఫోర్సుమెంట్ ఇంకా బాగా పెరుగుతుంది.. వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..