LPG Shortage: LPG సిలిండర్ల డెలివరీపై మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Shortage: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేదన్న ఆయన.. ప్రజలు గ్యాస్ కొరతపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,00,479 ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలు జరిగాయని వెల్లడించారు.
అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా Qatarలో జరిగిన ఘటనల కారణంగా ఆయిల్, గ్యాస్ సరఫరాలపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. అర్బన్ ప్రాంతాల్లో పైప్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా సుమారు 60 వేల మంది వినియోగదారులకు PNG అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు (SOP) జారీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. హాస్టళ్లు, ఆస్పత్రులు, అన్న క్యాంటీన్లు, కొన్ని హోటళ్లకు ప్రాధాన్యతతో గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు.
Also Read
ఇక, డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగాన్ని నివారించాలని హెచ్చరించిన మంత్రి నాదెండ్ల.. OTP విధానంలోనే డెలివరీ జరుగుతుందని స్పష్టం చేశారు. అనవసరంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద గుమ్మి కూడవద్దని ప్రజలను కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే 54 వేల ఇండక్షన్ స్టవ్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అనవసర అపోహల కారణంగా గ్యాస్ బుకింగ్స్ పెరిగి సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని మంత్రి అన్నారు. ఎక్కడైనా సిలిండర్ల డైవర్షన్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 9 మందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద, రాష్ట్రంలో గ్యాస్ సరఫరా సవ్యంగా కొనసాగుతోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్..
తాజావార్తలు
-
Imran Khan: ‘నా భార్యను కాపాడండి.. నా కేసు తర్వాత చూద్దాం’ లాయర్లకు ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్!
-
Narakasura Story : దీపావళి వెనుక పురాణ గాథ.. తెల్లవారుజామునే నూనె స్నానం ఇందుకే..!
-
Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
-
Archana Jois: KGFలో రాఖీ తల్లిగా కన్నీళ్లు పెట్టించి, ఇప్పుడు తెలుగులో గ్లామరస్ హీరోయిన్గా ఎంట్రీ
-
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..